Nagarjuna : బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై నాగార్జున కామెంట్స్.. నేను దర్శకుడినైతే ఆ కథని వెబ్ సిరీస్ చేసేవాడ్ని.. నా వందో సినిమా..

నాగార్జున బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై మాట్లాడుతూ.. ''బాగున్న సినిమాలను ఏ నెగిటివ్ ప్రచారం ఆపదు. బాలీవుడ్ లో కూడా గంగూభాయ్‌ కతీయవాడి, భూల్‌ భులయ్యా 2 సినిమాలు మంచి విజయాలు..........

Nagarjuna : బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై నాగార్జున కామెంట్స్.. నేను దర్శకుడినైతే ఆ కథని వెబ్ సిరీస్ చేసేవాడ్ని.. నా వందో సినిమా..

Nagarjuna comments on Boycott Trend

Nagarjuna :  టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ పక్క టీవీ షోలు, ఓ పక్క సినిమాలతో బిజీగా ఉన్నారు. 60 ఏళ్ళ వయసులో కూడా మన్మథుడిలా యంగ్ గా కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాలో గెస్ట్ పాత్రతో అందర్నీ ఆకట్టుకున్నారు నాగార్జున. త్వరలో ఘోస్ట్ సినిమాతో యాక్షన్స్ చేయబోతున్నారు. తాజాగా బ్రహ్మస్త్ర సినిమా సక్సెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలని చేశారు.

నాగార్జున బాలీవుడ్‌లో బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై మాట్లాడుతూ.. ”బాగున్న సినిమాలను ఏ నెగిటివ్ ప్రచారం ఆపదు. బాలీవుడ్ లో కూడా గంగూభాయ్‌ కతీయవాడి, భూల్‌ భులయ్యా 2 సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ సినిమా హిట్ అవ్వలేదంటే అది బాయ్‌ కాట్‌ ట్రెండ్‌ వల్ల మాత్రం కాదు” అని తెలిపారు. ఇక తన వందో సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులతో మాట్లాడుతున్నాను. కథలు వింటున్నాను. వందో సినిమా కాబట్టి కచ్చితంగా ప్రతిష్టాత్మంగా చేయాలని అనుకుంటున్నాను” అని తెలిపారు.

G Adiseshagiri Rao : మా అన్నయ్య ఎంతో ఆయన అంతే.. చెన్నైలో ఒకే రూంలో ఉన్నాం..

అలాగే..”గత ఐదేళ్లుగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాను. కరోనా టైంలో కూడా షూటింగ్స్‌ చేశాను. ఘోస్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓ మూడు నెలల పాటు కొత్త సినిమా గురించి ఆలోచించకుండా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను” అన్నారు నాగార్జున.

పౌరాణిక, చరిత్ర కథలని సినిమాలుగా తెరకెక్కించే అంశంపై మాట్లాడుతూ..”గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌, లార్డ్‌ ఆఫ్‌ ద రింగ్స్‌ లాంటి హాలీవుడ్‌ సినిమాలన్నీ కూడా కల్పిత కథలే. మనకు పౌరాణిక కథలు చాలా ఉన్నాయి. మహాభారతంలో ఎన్నో పాత్రలు, ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని సినిమాలుగా మలిస్తే అద్భుతంగా ఉంటాయి. ఈ విషయంలో మన దర్శకులు ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. బాహుబలి అలాంటి సినిమానే. మణిరత్నం ఇప్పుడు ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చేస్తున్నారు. చాలా గొప్ప కథ అది. దాన్ని రెండు పార్టులుగా తీస్తున్నాడు. నేను దర్శకుడినైతే ఆ కథని కనీసం గంట నిడివి గల పది ఎపిసోడ్స్‌ వెబ్‌ సిరీస్‌ లాగా చేస్తాను” అని తెలిపారు.