G Adiseshagiri Rao : మా అన్నయ్య ఎంతో ఆయన అంతే.. చెన్నైలో ఒకే రూంలో ఉన్నాం..

సంతాపసభలో నటుడు కృష్ణ సోదరుడు, నిర్మాత జి.ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ''కృష్ణంరాజుగారు, నేను, చంద్రమోహన్‌ దాదాపు ఆర్నెల్ల పాటు చెన్నైలో ఒకే రూమ్‌లో...........

G Adiseshagiri Rao : మా అన్నయ్య ఎంతో ఆయన అంతే.. చెన్నైలో ఒకే రూంలో ఉన్నాం..

Producer G Adiseshagiri Rao emotional comments on Krishnam raju

Updated On : September 14, 2022 / 8:09 AM IST

G Adiseshagiri Rao :  ఇటీవల రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణం ప్రభాస్ కి, ఆయన కుటుంబానికే కాదు టాలీవుడ్ కి కూడా తీరని లోటు. తాజాగా సినీ పరిశ్రమలోని కొన్ని యూనియన్లు, అసోసియేషన్లు కలిసి మంగళవారం నాడు ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణంరాజు కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్లు విచ్చేసి కృష్ణంరాజుకి నివాళులు అర్పించి ఆయన గురించి మాట్లాడారు.

Mohan Babu : ఫస్ట్ టైం బెంజ్ కారు ఎక్కించింది ఆయనే.. మా ఎలక్షన్స్‌లో పోటీ చేయమంది ఆయనే.. కృష్ణంరాజు గురించి చెప్తూ ఎమోషనల్ అయిన మంచు ఫ్యామిలీ..

ఈ సంతాపసభలో నటుడు కృష్ణ సోదరుడు, నిర్మాత జి.ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ”కృష్ణంరాజుగారు, నేను, చంద్రమోహన్‌ దాదాపు ఆర్నెల్ల పాటు చెన్నైలో ఒకే రూమ్‌లో కలిసి ఉన్నాం. మా అన్నయ్య కృష్ణగారితో ఎంత చనువుగా ఉండేవాడినో కృష్ణంరాజు గారితో కూడా అంతే చనువుగా ఉండేవాడిని. సినిమాల్లో, రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండేవారు” అని తెలిపారు. ఈ సంతాపసభలో అందరూ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.