Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్

తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి అప్డేట్ వచ్చింది. ఈ సారి బాలయ్య బాబు మాస్ మహారాజ్ తో సందడి చేయనున్నారు. రవితేజతో పాటు........

Balakrishna : ‘అన్ స్టాపబుల్’ బాలయ్యతో మాస్ మహారాజ్

Balayya Raviteja

Balakrishna :  బాలయ్య ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. ఇటీవలే ‘అఖండ’ సినిమా భారీ విజయం సాధించింది. మరో పక్క ఆహా ఓటిటిలో ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షోతో జనాల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోకి మోహన్ బాబు, మంచు లక్ష్మి , మంచు విష్ణు, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాని వచ్చి అలరించారు. తాజాగా ఈ వారం రాజమౌళి , కీరవాణి వచ్చారు.

ఇక మహేష్ బాబు ఎపిసోడ్ కూడా షూట్ కంప్లీట్ అయింది. కానీ ఇది ఏదైనా స్పెషల్ డేలో టెలికాస్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు ఆహా టీం. ఇక తాజాగా నెక్స్ట్ ఎపిసోడ్ గురించి అప్డేట్ వచ్చింది. ఈ సారి బాలయ్య బాబు మాస్ మహారాజ్ తో సందడి చేయనున్నారు. రవితేజతో పాటు గోపీచంద్ మలినేని కూడా రాబోతున్నట్టు సమాచారం.

Rajamouli : ఈ సినిమా డైరెక్టర్ నాకంటే పిచ్చోడిలా ఉన్నాడనుకున్నా : రాజమౌళి

ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత మొదలవ్వనుంది. అంతకుముందు గోపీచంద్ మలినేని రవితేజతో మూడు సినిమాలు తీసి హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్నాడు. అందుకే వీళ్ళిద్దర్నీ కలిపి పిలిచినట్టు తెలుస్తోంది. వచ్చే వారం ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వనుందని సమాచారం.

Pushpa : సంక్రాంతికి ఓటిటిలో ‘పుష్ప’ ??

బాలయ్య అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఫుల్ ఎనర్జీ గా ఉంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఎపిసోడ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రవితేజ కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు కాబట్టి ఈ ఎపిసోడ్ మరింత ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం అటు బాలయ్య అభిమానులు, ఇటు రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.