RRR : ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్.. మొదటిసారి పలు ఆఫ్రికా దేశాల్లో తెలుగు సినిమా రిలీజ్..

'ఆర్ఆర్ఆర్' సినిమా ఆఫ్రికా ఖండంలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఆఫ్రికా ఖండంలో తెలుగు సినిమాలు కేవలం సౌత్ ఆఫ్రికాలో మాత్రమే చాలా అరుదుగా రిలీజ్ అవుతుంటాయి. ఆఫ్రికా ఖండంలో.....

RRR : ‘ఆర్ఆర్ఆర్’ సరికొత్త రికార్డ్.. మొదటిసారి పలు ఆఫ్రికా దేశాల్లో తెలుగు సినిమా రిలీజ్..

Rrr Africa

 

RRR :  రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో భారీగా రూపొందిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా మార్చ్ 25న రిలీజ్ అవ్వబోతుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. సినిమా రిలీజ్ తోనే కొత్త కొత్త రికార్డులని సృష్టిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే చాలా దేశాల్లో విడుదలవుతున్నట్లు ప్రకటించారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మరో సరికొత్త రికార్డు సృష్టించింది.

‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆఫ్రికా ఖండంలో కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఆఫ్రికా ఖండంలో తెలుగు సినిమాలు కేవలం సౌత్ ఆఫ్రికాలో మాత్రమే చాలా అరుదుగా రిలీజ్ అవుతుంటాయి. ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికాలో మాత్రమే తెలుగు వాళ్ళు, భారతీయులు అధికంగా ఉంటారు. దీంతో కొన్ని సినిమాలు అప్పుడప్పుడు అక్కడ రిలీజ్ అవుతుంటాయి. అయితే తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికాతో పాటు తాంజానియా, జాంబియా, కెన్యా, ఉగాండా, జింబాంబ్వే, నమీబియా, ఘనా, నైజీరియా, అంగోలా, సుడాన్, కాంగో లాంటి 28 ఆఫ్రికా దేశాల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఆఫ్రికా ఖండంలో తొలిసారిగా ఇన్ని దేశాల్లో రిలీజ్ అవుతున్న ఓ తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది.

RRR : దుబాయ్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం సందడి

‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ఆఫ్రికా ఖండంలో సినిమా ఈవెంట్లని నిర్వహించే సంస్థ శ్రేయాస్ మీడియా దాని అనుబంధ నిర్మాణ సంస్థ అయిన గుడ్ సినిమా గ్రూప్ తో కలిసి రిలీజ్ చేస్తుంది. మొదటి సారి ఓ తెలుగు సినిమా ఆఫ్రికా దేశాల్లో భారీగా రిలీజ్ అవుతుండటంతో అక్కడ ఏ రేంజ్ లో సినిమా ఆడుతుందో అని ఆసక్తి చూపిస్తున్నారు టాలీవుడ్ వర్గాలు.