NTR30: ఎన్టీఆర్ సినిమాపై సస్పెన్స్ వీడేది ఎప్పుడు..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, రెగ్యులర్ షూటింగ్ కోసం రెడీ అవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఒక విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ అభిమానులను తీవ్ర అయోమయంలో పడేసింది. ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

NTR30: ఎన్టీఆర్ సినిమాపై సస్పెన్స్ వీడేది ఎప్పుడు..?

Suspense Continues On Heroine Of NTR30 Movie

NTR30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు కసరత్తులు చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, రెగ్యులర్ షూటింగ్ కోసం రెడీ అవుతోంది. అయితే ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కొరటాల తెరకెక్కించేందుకు రెడీ అవుతుండగా, ఈ సినిమాలో తారక్ ఓ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నాడు.

NTR30: ఎన్టీఆర్ సినిమాకు ఆ బ్యూటీ నో చెప్పిందా..?

ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక విషయంపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూ అభిమానులను తీవ్ర అయోమయంలో పడేసింది. ఈ సినిమాలో తారక్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై చిత్ర యూనిట్ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. తొలుత ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ, అమ్మడికి పెళ్లి కావడంతో, ఇప్పుడు ఆమె స్థానంలో మరో బ్యూటీని తీసుకునేందుకు వేట కొనసాగిస్తున్నారు. కాగా, ఈ క్రమంలో తారక్ సరసన చాలా మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డే, కియారా అద్వానీ వంటి పేర్లు వినిపించినా, వారెవ్వరూ ఈ సినిమాలో భాగం కాదని తెలుస్తోంది.

NTR30: సముద్రంలో తారక్ చితక్కొట్టుడు.. మామూలుగా ఉండదట!

రీసెంట్‌గా ఈ సినిమాలో ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ పేరు కొత్తగా యాడ్ అవగా, ఇప్పుడు మరో స్టార్ బ్యూటీ రష్మిక మందన్న పేరు కూడా వినిపిస్తోంది. తారక్ సరసన ఈ బ్యూటీ అయితే బాగుంటుందనే వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నా.. ఆ బ్యూటీ ఎవరనేది మాత్రం క్లారిటీ లేకుండా పోయింది. మరి కొరటాల శివ ఈ సస్పెన్స్‌ను ఎప్పుడు తొలగిస్తాడా.. ఈ సినిమాలో హీరోయిన్‌ను ఎప్పుడు ఫిక్స్ చేస్తాడా అని తారక్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.