Leo Movie: విజయ్ ‘లియో’ మూవీకి కళ్లు చెదిరే ఆఫర్.. కానీ పట్టించుకోని లోకేశ్!

తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల ‘వారిసు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, ఈ సినిమా సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు హీరో విజయ్. ఇక తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Leo Movie: తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల ‘వారిసు’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, ఈ సినిమా సక్సెస్‌తో తన నెక్ట్స్ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు హీరో విజయ్. ఇక తన నెక్ట్స్ చిత్రాన్ని దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Vijay Leo : విజయ్ ‘లియో’లో విజయ్ సేతుపతి ఉన్నాడా?

ఈ సినిమాకు ‘లియో’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్, ప్రస్తుతం కశ్మీర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ నటిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా లోకేశ్ తనదైన మార్క్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమాకు అదిరిపోయే డీల్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. కోలీవుడ్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఈ సినిమాకు ఇప్పటికే ఏకంగా రూ.400 కోట్ల భారీ డీల్ వచ్చిందట. లోకేశ్-విజయ్ కాంబినేషన్ మూవీ కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఈమేరకు ఆఫర్స్ వస్తున్నాయట.

Vijay : దసరాకే లియో.. చాలా సంవత్సరాల తర్వాత ఒకే ఇయర్ లో రెండు సినిమాలు..

అయితే, ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో, ఈ ఆఫర్స్‌ను చిత్ర యూనిట్ ఓకే చేయడం లేదట. సినిమా షూటింగ్ ముగిసిన తరువాతే థియేట్రికల్ రైట్స్‌ను అమ్మాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు