Akhanda 2: ‘అఖండ 2’ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్.. ఏపీ, తెలంగాణాలో టికెట్ ధరలు ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2(Akhanda 2) ఎట్టకేలకు విడుదల అవుతోంది. పలు వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Akhanda 2 advance ticket bookings open: Here are the ticket rate details
Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2(Akhanda 2) ఎట్టకేలకు విడుదల అవుతోంది. పలు వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే అఖండ 2 సినిమా టికెట్ ధరల పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరోసారి అనుమతులు ఇచ్చాయి. ముందుగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేయగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా టికెట్ ధరల పెంపునకు అవకాశం కలిపించింది. డిసెంబర్ 11న ప్రీమియర్ షోలకు కూడా రెండు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. తాజాగా, అఖండ 2 అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరి రెండు రాష్ట్రాలలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ తెలుసుకుందాం.
Meenakshi Chaudhary: ఆ హీరోతో రిలేషన్, త్వరలో పెళ్లి.. ఇవన్నీ కామనే కదా.. క్లారిటీ ఇచ్చేసిన మీనాక్షి
తెలంగాణలో:
- సింగిల్ స్క్రీన్స్ లలో రూ.50 (జీఎస్టీ)
- మల్టీప్లెక్స్ లలో రూ.100 (జీఎస్టీ)
- పెరిగిన ధరలు డిసెంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు కొనసాగుతాయి.
- డిసెంబరు 11 ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600 (జీఎస్టీ) లుగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్:
- సింగిల్ స్క్రీన్స్‌లో రూ.75 (జీఎస్టీతో)
- మల్టీప్లెక్స్ లలో రూ.100 (జీఎస్టీతో)
- ఈ ధరలు డిసెంబర్ 12 నుంచి పది రోజుల వరకు కొనసాగుతాయి.
- ఇక డిసెంబరు 11 ప్రీమియర్ షో టికెట్ ధర: రూ.600 (జీఎస్టీతో) గా నిర్ణయించారు.
