Vijay: విజయ్ కి మతిస్థిమితం సరిగా లేదు.. విడాకుల పిటీషన్ లో విజయ్ భార్య
విజయ్(Vijay) నుంచి విడాకుల కావాలంటూ వేసిన పిటీషన్ లో సంచలన విషయాలు పేర్కొన్న సంగీత సోర్ణలింగం.
Vijay wife Sangeeta mentions sensational details in divorce petition
- విజయ్ నుంచి విడాకులు కోరిన భార్య సంగీత
- విజయ్ కి మతిస్థిమితం సరిగా లేదంటూ వ్యాఖ్య
- కావాలనే చేస్తున్నారు అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్
Vijay: తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేతకు విజయ్ నుంచి విడాకుల కోరుతూ ఆయన భార్య సంగీత కోర్టు కెక్కిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ న్యూస్ ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న విజయ్ నుంచి దాదాపు 26 ఏళ్ళ తరువాత సంగీత విడాకులు కోరడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజానికి, కొద్దికాలంగా ఈ ఇద్దరు వేరుగానే ఉంటున్నారట. ఇక వీరి విడాకుల పిటీషన్ కేసు మార్చి నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే, విజయ్(Vijay)- సంగీతల విడాకుల పిటీషన్ లో రెండు అంశాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అదేంటంటే, విజయ్ గత కొంతకాలంగా వేరే హీరోయిన్ తో రిలేషన్ ఉంటున్నారని ఆమె ఆరోపించినట్టుగా తెలుస్తోంది. ఆమె కూడా తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్ అని తెలుస్తోంది. దీనికి సంబందించిన వార్తలు కూడా కొంతకాలంగా వైరల్ అవుతున్నాయి.
Kajal Agarwal: కొడుకు ప్రీ స్కూల్ ఫోటోలు షేర్ చేసిన కాజల్.. ఎంత క్యూట్ గా ఉన్నాయి చూడండి
ఇక మరో అంశం ఏంటంటే, విడాకుల పిటీషన్ లో విజయ్ కి మతి స్థిమితం సరిగా లేదని కూడా ఆమె పేర్కొంది. ఈ విషయం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే, ఈ విజయ్ ఫ్యాన్స్ సంగీతను తప్పు పడుతున్నారు. మతి స్థిమితం లేని వ్యక్తి హీరోగా ఇంతకాలం ఎలా కొనసాగుతాడు. అది కూడా స్టార్ హీరో రేంజ్ లో, అలాగే, ఒక రాజకీయ పార్టీని స్థాపించగలడా. ఇది కేవలం, ఆయన వ్యక్తిగత ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికే ఈ ఆరోపణలు ఆమె చేస్తున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఓపక్క రాజకీయాల్లో బిజీ అవుదామనుకున్న విజయ్ కి ఈ సమయంలో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం ఒక రంకంగా పెద్ద దెబ్బె అని చెప్పాలి. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇక మరో రెండు నెలల్లో తమిళనాట ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో విజయ్ ఓపక్క రాజకీయాలు, మరోపక్క వ్యక్తిగత జీవితాన్ని ఎలా బాలన్స్ చేస్తాడు అనేది చూడాలి మరి.

