T20 World Cup 2026 : ఊపిరిపీల్చుకున్న పాక్.. సెమీస్‌కు వెళ్లేందుకు అద్భుత అవకాశం.. కానీ, అసలు సమస్య అదే..
T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా గ్రూప్-2 నుంచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టేందుకు పాకిస్థాన్ జట్టుకు అద్భుత అవకాశం దొరికింది
T20 World Cup 2026
- న్యూజిలాండ్ జట్టుపై ఇంగ్లాండ్ విజయం
- సెమీస్‌కు వెళ్లేందుకు పాక్‌కు అద్భుత అవకాశం
- శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేస్తేనే ఛాన్స్
T20 World Cup 2026 : టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా గ్రూప్-2 నుంచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టేందుకు పాకిస్థాన్ జట్టుకు అద్భుత అవకాశం దొరికింది. సూపర్-8లో భాగంగా శుక్రవారం రాత్రి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్ జట్టుకు కలిసొచ్చింది. అయితే, పాకిస్థాన్ జట్టుకు పెద్ద సమస్య వచ్చిపడింది. న్యూజిలాండ్ జట్టు కంటే రన్ రేట్ పరంగా వెనుకబడి ఉంది. దీంతో శనివారం రాత్రి శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో భారీ విజయాన్ని పాకిస్థాన్ నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓటమి పాకిస్థాన్ జట్టుకు మేలు చేసింది. గ్రూప్-2 నుంచి సెమీ ఫైనల్ చేరేందుకు ఓ అవకాశం లభించినట్లయింది. శనివారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో పాక్ జట్టు ఘన విజయం సాధిస్తేనే గ్రూప్-2 నుంచి సెమీస్‌లోకి అడుగు పెట్టగలుగుతుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఇంగ్లాండ్‌తో పాటు న్యూజిలాండ్ జట్టు సెమీస్‌లోకి అడుగుపెడుతుంది.
13.1 ఓవర్లలో ఛేజ్ చేయడం సాధ్యమేనా?
సూపర్ -8లో భాగంగా పాకిస్థాన్ ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడింది. కివీస్ పై జరిగిన మ్యాచ్ డ్రా అయింది. ఆ తరువాత ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓటమిపాలైంది. దీంతో పాయింట్ల పట్టికలో మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇవాళ శ్రీలంకపై జరిగే చివరి మ్యాచ్ లో పాకిస్థాన్ తప్పనిసరిగా భారీ విజయం సాధించాలి. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. పాకిస్థాన్ కూడా సెమీఫైనల్లోకి వెళ్లాలంటే.. శ్రీలంకపై 64పరుగుల తేడాతో విజయం సాధించాలి. లేదంటే 13.1 ఓవర్లలో ఛేజ్ పూర్తి చేయడం అవసరం. అప్పుడు మాత్రమే నెట్ రన్‌రేట్ ఆధారంగా న్యూజిలాండ్ జట్టును పక్కకు నెట్టేసి సెమీ ఫైనల్లోకి పాకిస్థాన్ అడుగు పెట్టేందుకు అవకాశం ఉంది.
అలా జరిగితే పాకిస్థాన్‌కు గట్టి దెబ్బే..
గ్రూప్-2 నుంచి సెమీఫైనల్లోకి అడుగు పెట్టేందుకు పాకిస్థాన్ జట్టుకు అద్భుత అవకాశం వచ్చింది. శ్రీలంకపై భారీ విజయాన్ని నమోదు చేస్తే ఇంగ్లాండ్ తోపాటు పాకిస్థాన్ సెమీస్ లోకి వెళ్తుంది. ఒకవేళ పాకిస్థాన్ – శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే పాకిస్థాన్ జట్టుకు గట్టిదెబ్బే అవుతుంది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు కోల్పోతుంది. న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్లోకి అడుగు పెడుతుంది. ప్రస్తుతం గణాంకాల ప్రకారం.. పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ కు చేరాలంటే.. శనివారం రాత్రి శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో భారీ విజయాన్ని నమోదు చేయాలి.. అదే సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాకుండా ఉండాలి.
గ్రూప్-2లోని టీంల రన్‌రేట్ ఇలా..

