Virosh Weddind: విజయ్– రష్మిక పెళ్లి కోసం ప్రత్యేక ఆభరణాలు.. భారతీయత ఉట్టిపడేలా డిజైన్.. 10 నెలలు శ్రమించి
విజయ్- రష్మిక పెళ్లి(Virosh Wedding) కోసం 10 నెలలు శ్రమించి ప్రత్యేకమైన ఆభరణాలు చేయించారు.
Vijay Rashmika wedding special jewellery highlights
- విజయ్- రష్మిక పెళ్ళిలో ప్రత్యేక ఆకర్షణగా ఆభరణాలు
- భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా నగల డిజైన్
- నగల తయారీకి ఏకంగా 10 నెలల సమయం
Virosh Weddind: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లిచేసుకున్నారు. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెద్దలను ఒప్పించి మరీ ఎడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లి ఉదయపూర్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి అనంతరం తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు ఇద్దరు. భారతీయ సంప్రదాయ పద్దతిలో జరిగింది వీరి పెళ్లి.
అయితే, వీరి పెళ్ళిలో జంట ధరించిన ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా సెలెబ్రెటీలు పెళ్లిలో చాలా తక్కువగా ఆభరణాలను దరిస్తారు. కానీ, విజయ్- రష్మిక జంట మాత్రం ఒంటి నిండా బంగారు నగలతో మురిసిపోయారు. పెళ్లి కొడుకు విజయ్ కూడా మేడలో, చేతులకు ఆభరణాలు ధరించి కనిపించాడు. ఈ ఆభరణాలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. దీంతో ఆ ఆభరణాల గురించి తెలుసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
Sreemukhi: ట్రెండీ లుక్ లో యాంకరమ్మ.. శ్రీముఖి హాట్ ఫొటోలు వైరల్
అయితే, ఈ జంట ధరించిన ఆభరణాలు మార్కెట్ లో దొరికేవి కాదట. ఈ పెళ్లికోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. అది కూడా హైదరాబాద్ లోనే. ప్రముఖ నగల దుకాణం ఆయన శ్రీ జువ్వెల్లర్స్ ఈ ఆభరణాల తయారీకి కోసం ఏకంగా 10 నెలల పాటు శ్రమించారట. కేవలం ఆ నగల డిజైన్ గీయడానికి నెలలు రోజుల సమయం పట్టిందట. అంతేకాదు, ప్రతీ డిజైన్ విజయ్, రష్మిక(Virosh Weddind)ల శరీరాలకు అచ్చంగా సరిపోయేలా డిజైన్ చేశారట. ఇక విజయ్ దేవరకొండ ఆభరణాల విషయానికి వస్తే, ఆయనకు తీసుకున్న డిజైన్ మహారాజుల కోసం చేయించేవట.
ఏనుగులు, పులులు వంటి జంతువుల రూపాలను ఆయన ఆభరణాలలో చేర్చినట్టుగా సమాచారం. కాళ్లకు కూడా కడాలు ధరించి, మగవారి ఆభరణాల్లో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇక రష్మిక మందన్నా ధరించిన ఆభరణాలు దక్షిణ భారత ఆలయ శిల్పకళను ప్రతిబింబించేలా చేశారు. ఇందుకోసం ఏకంగా 11 రకాల ఆభరణాలు చేయించారట. మొత్తం ఈ పెళ్లి నగలకోసమే ఏకంగా రూ.4 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇలా భారతీయ ఆభరణాల సంప్రదాయం అనేది ఎంత గొప్పదో ప్రపంచానికి మరోసారి చాటారు ఈ జంట. దాంతో, విజయ్- రష్మిక పెళ్ళికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తన్నాయి. ఎక్కడ చూసినా వీరి పెళ్లి గురించే చర్చ నడుస్తోంది.
