Crime News : వామ్మో.. దారుణ ఘటన.. తల్లిదండ్రులను చంపి ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్.. ఆ తరువాత బిగ్ ట్విస్ట్.. అంతా ఆన్లైన్ గేమ్స్ వల్లే!
Crime News : ఓ బాలుడు కన్న తల్లిదండ్రులనే అతి కిరాతకంగా హతమార్చాడు. ఆ తరువాత ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి.. అది తిన్న తరువాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
boy killed his parents
- సౌదీలో రాజమండ్రి కర్రాడి ఘాతుకం
- ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు ఆగ్రహం
- తల్లిదండ్రులపై కత్తితో దాడి చేసి హత్య
- ఆ తరువాత భవనం పైనుంచి దూకి తను ఆత్మహత్య
Crime News : ఓ బాలుడు కన్న తల్లిదండ్రులనే అతి కిరాతకంగా హతమార్చాడు. ఆ తరువాత ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చి.. అది తిన్న తరువాత కొంత సేపటికి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గల్ఫ్ రాజధాని రియాద్‌లో చోటుచేసుకుంది. వీరంతా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన వారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
గల్ఫ్ రాజధాని రియాధ్ నగరంలో తెలుగు ప్రవాసీయులు ఎక్కువగా నివసించే హరా అనే ప్రాంతంలో గురువారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి (49), గాలి శ్రీదేవి (43) దంపతులకు ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు యెజ్ర ప్రభాకర్. ప్లస్2 చదువుతున్నాడు. రవి బ్యాంకులో ఉద్యోగిగా, శ్రీదేవి ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్నాడు.
ప్రభాకర్ ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటుపడ్డాడు. ప్రతీరోజూ ఆన్లైన్ గేమ్‌లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. తల్లిదండ్రులు పలుసార్లు మందలించినా ప్రభాకర్ పట్టించుకోలేదు. ఇదే విషయంపై గురువారం రాత్రి ప్రభాకర్ ను తల్లిదండ్రులు తీవ్రంగా మందలించారు. దీంతో ప్రభాకర్ తల్లిదండ్రులపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ సమయంలో విచక్షణ కోల్పోయి వారిపై దాడి చేశాడు.
కత్తి తీసుకొని తల్లిదండ్రులను అనేకసార్లు పొడిశాడు. ఆ తరువాత ఆన్ లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకొని.. అది తిన్న తరువాత తాను కూడా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
