Karmastalam: బిగ్ బాస్ దివి పాన్ ఇండియా మూవీ.. ‘కర్మస్థలం’ ఫస్ట్ లుక్ నెక్స్ట్ లెవల్
దివి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘కర్మస్థలం(Karmastalam)’. పాన్ ఇండియా లెవల్లో దర్శకుడు రాకీ షెర్మాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Actress Divi first look from karmasthalam movie is out now
Karmastalam: తెలుగు బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన బ్యూటీ దివి. ఈ ఫేమ్ తోనే పలు సినిమాల్లో అవకాశాలు కూడా దక్కించుకుంది. ఆ క్రమంలోనే ఏకంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది దివి. చిరు హీరోగా వచ్చిన గాడ్ ఫాథర్ సినిమాలో సునీల్ కి భర్య పాత్రలో కనిపించింది. ఆ తరువాత కూడా పలు సినిమాల్లో కనిపించినా సక్సెస్ కాలేకపోయింది. అయితే, సడన్ గా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది.
Indraja: నా బాడీ నా ఇష్టం.. ఎలా పడితే అలా ఉంటాను.. నన్ను ఎవరూ ఎం అడగకూడదు.. అంటే ఎలా..?
దివి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘కర్మస్థలం(Karmastalam)’. పాన్ ఇండియా లెవల్లో దర్శకుడు రాకీ షెర్మాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి దివి ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్. యుద్ధభూమిలో కాలు దువ్విన యువరాణిలాగా కనిపించింది దివి. ఎంతో పవర్ ఫుల్ గా ఉన్న ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. చూస్తుంటే పీరియాడికల్ డ్రామాగా, లేడీ ఓరియెంటెడ్ కథతో ఈ సినిమా రానుందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా గురించి మేకర్స్ మాట్లాడుతూ.. కర్మస్థలం సినిమాకి విజువల్స్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్ ప్రధాన బలమని చెప్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది అని తెలిపారు. ఇంకా ఈ సినిమాలో అరవింద్ కృష్ణ, చుంకీ పాండే, అర్చనా శాస్త్రి, ప్రిన్స్, దివి, కాలకేయ ప్రభాకర్, వెంకటేష్ ముమ్మిడి, వినోద్, బలగం సంజయ్,దిల్ రమేష్, నాగ మహేష్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Actress Divi first look from karmastalam movie is out now
