Indraja: నా బాడీ నా ఇష్టం.. ఎలా పడితే అలా ఉంటాను.. నన్ను ఎవరూ ఎం అడగకూడదు.. అంటే ఎలా..?

తెలుగు సినిమా ప్రేక్షకులకి నటి ఇంద్రజ(Indraja) గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను అనుభవించిన ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా తన మార్క్ కనబరుస్తోంది.

Indraja: నా బాడీ నా ఇష్టం.. ఎలా పడితే అలా ఉంటాను.. నన్ను ఎవరూ ఎం అడగకూడదు.. అంటే ఎలా..?

Actress Indraja makes shocking comments on the dressing style of today's girls

Updated On : December 10, 2025 / 6:16 PM IST

Indraja: తెలుగు సినిమా ప్రేక్షకులకి నటి ఇంద్రజ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ను అనుభవించిన ఈ బ్యూటీ ఇప్పుడు నటిగా తన మార్క్ కనబరుస్తోంది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా టీవీ షోలలో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న సమయంలో పాత్రకు, సన్నివేశానికి తగ్గట్టుగా కాస్త గ్లామర్ గా కనిపంచిన ఇంద్రజ(Indraja) బయట మాత్రం చాలా పద్దతిగా కనిపిస్తారు. చీరకట్టులో పదహారణాల సంప్రదాయ మహిళగా కనిపిస్తాయి. అనవసరమైన గ్లామర్ షోకి, స్కిన్ షోకి ఆమె పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు ఇంద్రజ.

Priya Prakash Varrier: గ్లామర్ హద్దులు చెరిపేసిన ప్రియా ప్రకాష్.. హాట్ ఫోటోలు

“ఇది నా బాడీ.. నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను.. నచ్చిన డ్రెస్ వేసుకున్నాను.. నన్ను ఎవరు ప్రశ్నించకూడదు. అంటే ఎలా. నీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటా, ఎలా పడితీ అలా తిరుగుతా అనే హక్కు నీకు ఎంత ఉందో.. డ్రెస్సింగ్ అభ్యంతకరంగా చీప్ గా ఉంటె దాని గురించి అడిగే హక్కు ఎదుటివారికి తప్పకుండా ఉంటుంది. మనం పబ్లిక్ లో ఇలా ఉండాలనేది ఒకటి ఉంటుంది. అయినా కూడా నా ఇష్టం నేను వేసుకుంటాను అంటే.. వేసుకున్నాక కామెంట్స్ కూడా తీసుకోవాలి.

అసభ్యకరమైన డ్రెస్సులు పబ్లిక్ లో కాదు పర్సనల్ ప్లేస్ లో వేసుకోండి. పబ్లిక్ లోకి అలానే వస్తే కామెంట్స్ చేస్తారు. అమ్మయిలు అందంగా కనిపించాలనుకోవడం తప్పు కాదు. కానీ, ఛీ అనిపించేలా ఉండకూడదు. ఈ విషయంలో సెలబ్రిటీలు స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎందుకంటే, వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి. మనల్నీ ట్రీట్ చేసే విధానం మన వేసుకునే బట్టల్లోనే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది ఇంద్రజ. ఆమె చేసిన ఈ కామెంట్స్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నాయి.