Rahul Gandhi: అదో ‘ఈజిప్ట్ ముస్లిం బ్రదర్‌హుడ్‌’.. ఆర్ఎస్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ..

ఆర్ఎస్‌ఎస్ ఛాందసవాద, ఫాసిస్ట్ విధానం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ విధానం పూర్తిగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను దాదాపు ఇది స్వాధీనం చేసుకుందని విమర్శించారు.

Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ పదిరోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. సోమవారం సాయంత్రం లండన్‌లోని థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్‌లో పలు అంశాలపై తన అభిప్రాయాలను రాహుల్ వెల్లడించారు. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ఎస్‌ఎస్ ఛాందసవాద, ఫాసిస్ట్ విధానం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ విధానం పూర్తిగా మారిపోయిందని అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను దాదాపు ఇది స్వాధీనం చేసుకుందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల దేశంలోని మీడియా, న్యాయవ్యవస్థ, పార్లమెంట్, ఎన్నికల సంఘం, దాదాపు అన్ని సంస్థలు ఏదోఒకవిధంగా ముప్పుపొంచి ఉన్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్‌ను ‘ఈజిప్ట్ ముస్లిం బ్రదర్ హుడ్’తో పోల్చారు.

Rahul Gandhi: విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించారన్న బీజేపీ విమర్శలపై రివర్స్ అటాక్ చేసిన రాహుల్ గాంధీ

ప్రజాస్వామ్యంలోని సంస్థలన్నింటిని తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న బీజేపీని ఎవరూ ఓడించలేరనే కథనాలుకూడా నడుస్తున్నాయని, అయితే, బీజేపీ ఎప్పటికీ అధికారంలో ఉండబోదని రాహుల్ అన్నారు. బీజేపీ హయాంలో దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఏ విధంగా ఇబ్బందులకు గురవుతున్నారో దేశంలో అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయని రాహుల్ తెలిపారు. చైనా గురించి మాట్లాడుతూ.. చైనా విషయంలో కాంగ్రెస్ విధానం చాలా స్పష్టంగా ఉందని రాహుల్ చెప్పారు. మేము ఎవరినీ మనదేశంలోకి చొచ్చుకొచ్చేందుకు అనుమతించమని స్పష్టం చేశారు. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొస్తున్నా ఈ అంశంపైన చర్చించేందుకు ప్రభుత్వం ఒప్పుకోలేదని రాహుల్ అన్నారు.

Rahul Gandhi Comments : కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాహుల్ కీలక వ్యాఖ్యలు.. ప్రమాదంలో భారత ప్రజాస్వామ్యం

రష్యా – యుక్రెయిన్ యుద్ధంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. యుక్రెయిన్ విధానంపై ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. యుక్రెయిన్ విషయంలో విదేశాంగ విధానంతో నేను ఏకీభవిస్తున్నానని, దీనిపై జాతీయ స్థాయిలోకూడా ఆసక్తి నెలకొందని తెలిపారు. నేను ఎలాంటి యుద్ధానికైనా వ్యతిరేకమేనని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.

 

Congress leader Rahul Gandhi in London, UK

ట్రెండింగ్ వార్తలు