Lionel Messi : మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ.. స్టేడియంలో అల్లకల్లోలం

Lionel Messi : కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు.

Lionel Messi : మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ.. స్టేడియంలో అల్లకల్లోలం

Lionel Messi

Updated On : December 13, 2025 / 2:56 PM IST

Lionel Messi : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్ చేరుకున్నారు. శనివారం తెల్లవారు జామున కోల్‌కతాలో అడుగు పెట్టిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయితే, ఉదయం కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో మెస్సీ సందడి చేశారు. అతన్ని చూసేందుకు పెద్దెత్తున అభిమానులు తరలివచ్చారు.

మెస్సిని దగ్గరి నుంచి చూడాలని, అతడి ఆటను వీక్షించాలని కొన్నిరోజులుగా అభిమానులు ఎదురు చూశారు. ఇలాంటి సమయంలో మెస్సీ స్టేడియంలో నుంచి త్వరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేడియంలో పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండలేదని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. స్టేడియంలో ఏర్పాటు చేసిన టెంట్‌ను కూల్చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకిదిగి లాఠీఛార్జి చేశారు.

ఇదిలాఉంటే.. కోల్‌కతాలోని లేక్‌టౌన్‌లో ఏర్పాటు చేసిన 70 అడుగుల అర్జెంటీనా పుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి విగ్రహాన్ని శనివారం బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌తో కలిసి మెస్సి వర్చువల్ గా ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. విగ్రహం వద్ద సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
ఈ సందర్భంగా మెస్సి మాట్లాడుతూ.. ఈరోజు ఈ ప్రారంభోత్సవం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కోల్‌కతా ప్రజలు జాతీయ జట్టుకు, నాకు ఇచ్చే మద్దతుతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడ ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు.