Dogs Bulls Attack : వామ్మో.. రెచ్చిపోయిన వీధి కుక్కలు, ఎద్దు.. ఎలా దాడి చేశాయో చూడండి.. షాకింగ్ వీడియోలు

అటు కుక్కలు, ఇటు ఎద్దులు.. దాడులకు తెగబడుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోతున్నారు. Dogs Bulls Attack

Dogs Bulls Attack : వామ్మో.. రెచ్చిపోయిన వీధి కుక్కలు, ఎద్దు.. ఎలా దాడి చేశాయో చూడండి.. షాకింగ్ వీడియోలు

Dogs Bulls Attack(Photo : Google)

Viral Videos : ఈ మధ్య కాలంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. రోడ్డుపై ఒంటరిగా కనిపిస్తే చాలు రౌండప్ చేసి విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పళ్లతో కొరికి కొరికి చంపేస్తున్నాయి. వీధి కుక్కలే అనుకుంటే.. ఇప్పుడు ఎద్దులు కూడా తోడయ్యాయి. మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. కొమ్ములతో కుమ్మి కుమ్మి చంపేస్తున్నాయి. అటు కుక్కలు, ఇటు ఎద్దులు.. దాడులకు తెగబడుతుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. రోడ్డు మీదకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని, ఏ ఎద్దు కుమ్ముతుందోనని భయపడే పరిస్థితులు వచ్చాయి.

Also Read..Lift Accident : OMG.. ఆ పిల్లలు నిజంగా అదృష్టవంతులే.. రెప్పపాటులో ఘోర లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డారు, షాకింగ్ వీడియో

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్ పత్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. బాలేని పోలీస్ స్టేషన్ పరిధిలోని దత్తానగర్ లో నడిరోడ్డుపై పశువులు విచ్చలవిడిగా సంచరిస్తూ దాడులు చేస్తున్నాయి. రోడ్డుపై ఓ ఎద్దు, ఆవు ఉన్నాయి. ఆవు పక్కనే లేగ దూడ ఉంది. ఇంతలో ఓ వృద్ధుడు రోడ్డుపై నడుచుకుంటూ వచ్చాడు. ఓ ఎద్దుకి ఎదురుగా వెళ్లాడు. అంతే, సడెన్ గా ఆ ఎద్దు దాడికి దిగింది.

కొమ్ములతో ఆ వృద్ధుడిని పొడిచింది. పాపం ఎద్దు దాడి నుంచి ఆ వృద్ధుడు  తప్పించుకోలేకపోయాడు. రోడ్డుపైనే కూలబడ్డాడు. ఇంతలో ఓ కుర్రాడు కర్ర తీసుకుని ఎద్దు మీదకు వచ్చాడు. దాంతో ఆ ఎద్దు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఎద్దు దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, లేగ దూడకు ఏమైనా హాని చేస్తాడని భావించిందో మరో కారణమో కానీ.. వృద్ధుడిపై దాడి చేసింది ఎద్దు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read..Indigo Flight : ఇండిగో విమానంలో ప్రయాణీకులకు చేదు అనుభవం.. తుడుచుకోవటానికి టిష్యూలు ఇచ్చారు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మరో దారుణం జరిగింది. ఘజియాబాద్ లో వీధికుక్కలు రెచ్చిపోయాయి. రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న బాలుడిపై వీధి కుక్కలు సడెన్ గా దాడి చేశాయి. ఒకేసారి ఐదు కుక్కలు బాలుడిని చుట్టుముట్టి అటాక్ చేశాయి. దీంతో బాలుడు భయంతో గట్టిగా కేకలు వేశాడు. ఇంతలో అటుగా వచ్చిన డెలివరీ బాయ్ కుక్కలను తరిమి బాలుడిని కాపాడాడు. సమయానికి అతడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే ఘోరం జరిగిపోయి ఉండేది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇప్పటిపైనా అధికారులు స్పందించాలని.. రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తూ దాడులకు తెగబడుతున్న వీధి కుక్కలు, ఎద్దులను కట్టడి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.