Indigo Flight : ఇండిగో విమానంలో ప్రయాణీకులకు చేదు అనుభవం.. తుడుచుకోవటానికి టిష్యూలు ఇచ్చారు.. వీడియో వైరల్

పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ శనివారం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఇండిగో యాజమాన్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

Indigo Flight : ఇండిగో విమానంలో ప్రయాణీకులకు చేదు అనుభవం.. తుడుచుకోవటానికి టిష్యూలు ఇచ్చారు.. వీడియో వైరల్

Indigo Flight

Amarinder Singh Raja : చండీగఢ్ నుంచి జైపుర్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణీకులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రయాణికులకు విమాన సిబ్బంది టిష్క్యూలు పంచిపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అదే విమానంలో ప్రయాణించిన పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమరీందర్ సింగ్ రాజా వారింగ్ తన ట్విటర్ ఖాతాద్వారా పంచుకున్నారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ప్రయాణికులకు విమానం సిబ్బంది టిష్క్యూలు ఎందుకు ఇచ్చారంటే చెమట తుడుచుకోవటానికట.

Indigo Flight: ఇండిగో విమానంలో రచ్చచేసిన మందుబాబులు.. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ఏం చేశారంటే ..

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో విమానం చండీగఢ్ నుంచి జైపూర్ వెళ్లింది. అయితే, విమానంలో ఏయిర్ కండిషన్ (ఏసీ) ఆన్‌కాకుండానే గాల్లోకి ఎగిరింది. దీంతో విమానం ప్రయాణిస్తున్న సమయంలోనూ ఏసీ ఆన్‌కాకపోవటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్కొక్కరికి చెమటలు కారుతున్నాయి. అయితే, ఏదైనా ఎయిర్ పోర్టులో ల్యాండ్ చేసి సమస్యను పరిష్కరించాల్సిన విమాన సిబ్బంది.. చెమటను తుడుచుకునేందుకు ఎయిర్ హోస్టెస్ టిష్యూ పేపర్లు ఇచ్చారు. దాదాపు ప్రయాణికులు గంటలపాటు ఇలా ఇబ్బంది పడ్డారు.

IndiGo Flight Threatened :పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు.. ముంబై విమానాశ్రయంలో కలకలం

అదే విమానంలో ప్రయాణిస్తున్న పంజాబ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ శనివారం ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఇండిగో యాజమాన్యంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. విమానం ఎక్కే సమయంలో పదిహేను నిమిషాల వరకు క్యూలో ఉండేలా చేశారు. తరువాత ఏసీలు ఆన్ చేయకుండానే విమానం బయల్దేరిందని చెప్పారు. టేకాఫ్ నుంచి ల్యాండింగ్ వరకు ఏసీని ఆన్ చేయలేదు. దీంతో ప్రయాణికులు చాలా అవస్థలు పడ్డారు. కొందరు వేడికి తట్టుకోలేక చల్లగా ఉండేందుకు కాగితాలతో విసురుకున్నారు.

ఈ క్రమంలో చెమటలను తుడుచుకునేందుకు ఎయిర్ హోస్టెస్ ప్రయాణికులకు టిష్యూలు ఇచ్చారని అమరీందర్ సింగ్ చెప్పారు. ఈ విషయాన్ని తెలుపుతూ పౌరవిమాన సర్వీసుల నియంత్రణ సంస్థ డీజీసీఏకు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ట్యాగ్ చేస్తూ ట్వీట్‌ చేశారు. ఇండిగో ఎయిర్ లైన్స్‌తో పాటు, సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరీందర్ తన ట్వీట్ లో కోరారు.