Indigo Flight: ఇండిగో విమానంలో రచ్చచేసిన మందుబాబులు.. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ఏం చేశారంటే ..

 ఢిల్లీ నుండి పాట్నాకు వెళ్లే విమానంలో జరిగిన ఘటన అధికారుల విచారణలో ఉందని ఇండిగో యాజమాన్యం తెలిపింది. అయితే, సోషల్ మీడియాలోని కొన్ని విభాగాలలో పేర్కొన్నట్లుగా విమానంలో ఎలాంటి గొడవ జరగలేదని తన అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ఇండిగో యాజమాన్యం వెల్లడించింది. 

Indigo Flight: ఇండిగో విమానంలో రచ్చచేసిన మందుబాబులు.. సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు ఏం చేశారంటే ..

Indigo Flite

Indigo Flight: గత కొద్దిరోజుల క్రితం ఎయిర్ ఇండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో 70ఏళ్ల వృద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఇండిగో విమానంలో మద్యం సేవించిన ముగ్గురు వ్యక్తులు వీరంగం సృష్టించారు. అడ్డొచ్చిన వారిపై దాడికిసైతం పాల్పడ్డారు.

Air India : ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్రవిసర్జన చేసిన వ్యక్తి అరెస్ట్..

ఆదివారం ఢిల్లీ నుంచి పాట్నా వెళ్తున్న ఇండిగో విమానంలో ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి రచ్చరచ్చ చేశారు. ఎయిర్ హోస్టెస్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా, అడ్డొచ్చిన విమాన కెప్టెన్‌పైసైతం దాడి చేశారు. మందుబాబుల చేష్టలతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సిబ్బంది.. విమానం పాట్నా విమానాశ్రయంలో ల్యాండ్ కాగానే ఇద్దరు వ్యక్తులను సీఐఎస్ఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

 

ఈఘటనలో మరో వ్యక్తి పరారవ్వడంతో అతనికోసం గాలిస్తున్నట్లు పాట్నా ఎయిర్‌పోర్ట్ ఎస్‌హెచ్‌ఓ రాబర్ట్ పీటర్ తెలిపారు.  ఢిల్లీ నుండి పాట్నాకు 6E 6383 విమానంలో జరిగిన సంఘటనకు సంబంధించి, ఈ విషయం అధికారులతో విచారణలో ఉందని ఇండిగో యాజమాన్యం తెలిపింది. అయితే, సోషల్ మీడియాలోని కొన్ని విభాగాలలో నివేదించబడినట్లుగా విమానంలో ఎలాంటి గొడవ జరగలేదని తన అధికారిక ట్విటర్ ద్వారా వెల్లడించింది.