Lift Accident : OMG.. ఆ పిల్లలు నిజంగా అదృష్టవంతులే.. రెప్పపాటులో ఘోర లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డారు, షాకింగ్ వీడియో

అప్పటికే పిల్లలు ఇద్దరూ బయటకు వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ ఇద్దరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. Pune Lift Accident

Lift Accident : OMG.. ఆ పిల్లలు నిజంగా అదృష్టవంతులే.. రెప్పపాటులో ఘోర లిఫ్ట్ ప్రమాదం నుంచి బయటపడ్డారు, షాకింగ్ వీడియో

Pune Lift Accident

Pune Lift Accident : ప్రమాదం ఎప్పుడు ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో చెప్పలేము. ఊహించని విధంగా ప్రమాదాలు జరుగుతుంటాయి. రెప్పపాటులో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అయితే, అప్పుడప్పుడు కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. తృటిలో ప్రమాదాల బారి నుంచి తప్పించుకుంటారు. అలాంటి వారు అదృష్టవంతులే అని చెప్పారు. తాజాగా అలాంటి మిరాకిల్ ఒకటి పుణెలో(Pune) చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలు తృటిలో పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పిల్లలు ఇలా బయటకు రాగానే… లిఫ్ట్(Lift) అమాంతం కిందకు పడిపోయింది. ఏకంగా 10వ అంతస్తు నుంచి పెద్ద శబ్దంతో పడింది.

Also Read..Sri Sathyasai District : బాబోయ్.. ఒక్కసారిగా కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం, షాకింగ్ వీడియో

పుణెలోని బవదాన్ కి సాయి వెలాసిటీ సొసైటీలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ నివాసం ఉండే ఇద్దరు పిల్లలు లిఫ్ట్ ఎక్కారు. బటన్ నొక్కారు. ఆ తర్వాత లిఫ్ట్ కదిలింది. బటన్ నొక్కిన చోట ఆగింది. డోర్లు తెరుచుకున్నాయి. వెంటనే ఆ ఇద్దరు పిల్లలు లిఫ్ట్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ వెంటనే డోర్లు క్లోజ్ అయ్యాయి. ఆ మరుక్షణమే ఘోర ప్రమాదం జరిగింది. లిఫ్ట్ ఒక్కసారిగా పడిపోయింది. ఏకంగా 10వ అంతస్తు నుంచి పడింది. పెద్ద పెద్ద శబ్దాలు కూడా వినిపించాయి.(Lift Accident)

అయితే, అప్పటికే పిల్లలు ఇద్దరూ బయటకు వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆ ఇద్దరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. లేదంటే ఊహించని ఘోరం జరిగిపోయి ఉండేది. పిల్లలు బయటకు వెళ్లిన వెంటనే లిఫ్ట్ వైర్ తెగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

Also Read..Cleric Kiss : ఛీ..ఛీ.. బరితెగించిన మతగురువు, అమ్మాయితో అసభ్యకర ప్రవర్తన, అక్కడ తాకుతూ ముద్దులు పెడుతూ.. వీడియో వైరల్

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లిఫ్ట్ అమాంతం కింద పడటంతో సొసైటీలో నివాసం ఉండే వారు భయంతో వణికిపోయారు. ఏం జరిగిందోనని కంగారుపడ్డారు. తీరా వచ్చి చూస్తే లిఫ్ట్ పడిపోయిందని తెలిసి కాసేపు షాక్ లో ఉండిపోయారు. ఆ సమయంలో లిఫ్ట్ లో ఎవరైనా ఉండి ఉంటే ఘోరం జరిగిపోయి ఉండేదన్నారు.

రెప్పపాటులో పిల్లలు పెను ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సొసైటీలో నివాసం ఉండే వారు లిఫ్ట్ బిల్డర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు లిఫ్ట్ బిల్డర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.(Lift Accident)

ఈ ప్రమాదం.. సొసైటీలో నివాసం ఉండే వారిని షాక్ కి గురి చేసింది. ఈ ఘటన తర్వాత లిఫ్ట్ ఎక్కాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ లిఫ్ట్ అమాంతం పడిపోతుందోనని కంగారుపడుతున్నారు. బిల్డర్లు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతున్నాయని ఆరోపిస్తున్నారు. మరోవైపు పిల్లల తల్లిదండ్రులు ఎంతైనా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను లిఫ్ట్ లో ఒంటరిగా పంపకపోవడమే మంచిది. వారి వెంట కచ్చితంగా పెద్దలు ఉండేలా చూసుకోవాలి.