Sri Sathyasai District : బాబోయ్.. ఒక్కసారిగా కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం, షాకింగ్ వీడియో

గతేడాది నుంచి భవనం పూర్తిగా దెబ్బతింది. తల్లిదండ్రులు తమ పిల్లలను భయం భయంగానే స్కూల్ కి పంపిస్తున్నారు. Sri Sathyasai District

Sri Sathyasai District : బాబోయ్.. ఒక్కసారిగా కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల భవనం, షాకింగ్ వీడియో

Sri Sathyasai District

Sri Sathyasai District – School Builidng : శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో కలకలం రేగింది. ఓ ప్రభుత్వ పాఠశాల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. అంతా చూస్తుండగానే భవనం నేలమట్టం అయ్యింది. దీంతో ఒక్కసారిగా అక్కడ అలజడి చెలరేగింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే, భవనం కూలిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. లేదంటే ఎవరూ ఊహించని విధంగా ఘోరం జరిగిపోయి ఉండేదని గ్రామస్తులు అంటున్నారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఊపిరిపీల్చుకున్నారు.

ఈ స్కూల్ లో ఇద్దరు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. 11 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గతేడాది నుంచి భవనం పూర్తిగా దెబ్బతింది. ఏ క్షణమైనా కూలడానికి సిద్ధంగా ఉంది. దాంతో తల్లిదండ్రులు తమ పిల్లలను భయం భయంగానే స్కూల్ కి పంపిస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి దుర్వార్త వినాల్సి వస్తుందోనని వారు రోజూ టెన్షన్ పడేవారు. ఎందుకంటే స్కూల్ బిల్డింగ్ పరిస్థితి అంతా దారుణంగా ఉంది. అదెప్పుడు కూలిపోతుందోనని అంతా కంగారుపడేవారు.

Kerala Road Accident : రోడ్డు దాటుతున్నారా? బీకేర్ ఫుల్.. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. ఒళ్లుగగుర్పొడిచే యాక్సిడెంట్ వీడియో

అయితే, పాఠశాల భవనం శిథిలావస్థకు చేరినా అధికారులు పట్టించుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా స్కూల్ బిల్డింగ్ నేలమట్టమైంది. భవనం కుప్పకూలుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒకవేళ పిల్లలు ఉన్న సమయంలో బిల్డింగ్ కూలి ఉంటే ఊహించని ఘోరం జరిగిపోయి ఉండేదని స్థానికులు అంటున్నారు.

అసలు అలా తలుచుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ఎవరూ లేని సమయంలో భవనం కూలిందని, లేకపోతే ఎంత అనర్థం జరిగేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, భవనం కూలే వరకు అధికారులు మౌనంగా ఉండటం దారుణం అంటున్నారు గ్రామస్తులు. ఒకవేళ పిల్లలు ఉన్న సమయంలో బిల్డింగ్ కూలి శిథిలాలు పిల్లల మీద పడుంటే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.

Also Read..TTD Chairman: టీటీడీ చైర్మన్ పదవి రేసులో నలుగురు.. మాజీ మంత్రివైపు అధిష్టానం మొగ్గు!