Uthra Murder Case : పాము కాటుతో భార్య మృతి.. భర్తను దోషిగా తేల్చిన కోర్టు

గతేడాది మే నెలలో.. ఆస్తి కోసం పాముతో కరిపించి భార్యను చంపిన కేరళకు చెందిన 28 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తిని ఇవాళ కేరళ కోర్టు దోషిగా తేల్చింది.

Uthra Murder Case  గతేడాది మే నెలలో.. ఆస్తి కోసం పాముతో కరిపించి భార్యను చంపిన కేరళకు చెందిన 28 ఏళ్ల సూరజ్ అనే వ్యక్తిని ఇవాళ కేరళ కోర్టు దోషిగా తేల్చింది. అత్యంత అరుదైనదిగా ఈ నేరాన్ని పేర్కొన్న కొల్లం జిల్లాలోని అడిషనల్ సెషన్స్ కోర్టు..బుధవారం రోజున దోషికి శిక్షను ఖరారు చేయనుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన సూరజ్‌ ఆస్తి కోసం తన భార్య ఉతరాని హత్య చేయాలనుకున్నాడు. తన భార్యని చంపి..ఆమె దగ్గరున్న డబ్బులు,బంగారం తీసుకొని మరొకరిని పెళ్లిచేసుకోవాలని ఫ్లాన్ చేశాడు. ఎవరికీ తనపై అనుమానం రాకుండా పథకం రచించాడు. హత్య చేసినా సహజమైన మరణంగా ఉండేలా విషపు నాగుపామును ఎంచుకున్నాడు. తన స్నేహితుడు సురేష్ అనే వ్యక్తి నుంచి నాగుపామును తెప్పించుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో మొదటి ప్రయత్నంలో తన భార్యను పాటు కాటుతో చంపేందుకు ప్రయత్నించగా..ఆ ప్రయత్నం విఫలమైంది. నెల రోజులు హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్ అయింది ఉతరా. అయితే మే నెలలో మరోసారి తన స్నేహితుడి దగ్గరి నుంచి పాముని తీసుకొచ్చి..తన భార్యని చంపేందుకు ప్రయత్నించాడు. మొదటి  ప్రయత్నం విఫలం కావడంతో రెండోసారి మే నెలలో మాత్రం భార్యని పథకం ప్రకారం హత మార్చాడు.

గతేడాది మే- 7న ఉతరా..కొల్లం జిల్లాలోని ఆంచల్‌లోని తన ఇంట్లో పాముకాటుతో మరణించింది. ఉతరా మరణించిన కొన్ని రోజుల తర్వాత ఆమె భర్త సూరజ్ తన ఆస్తి కోసం ప్రయత్నించాడు. దీంతో ఉతరా తల్లిదండ్రులు తమ కుమార్తె మరణంపై తమకు అనుమానం ఉందని పోలీసులకు కంప్లెయింట్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులకి అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. సూరజ్ తన భార్య అడ్డు తొలగించుకుని ఆమె డబ్బు, బంగారం తీసుకొని మరొకరిని వివాహం చేసుకోవాలనే ప్లాన్‌తోనే ఆమెను పాముకాటుతో హత్య చేసినట్లు తేలిందని పోలీసులు తెలిపారు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడిని దోషిగా తేల్చింది. కోర్టు నిర్ణయాన్ని ఆ రాష్ట్ర డీజీపీ అనీల్ కాంత్ ప్రశంసించారు. సందర్భానుసార సాక్ష్యాల ఆధారంగా నిందితుడిని దోషిగా నిర్ధారించిన అరుదైన కేసులలో ఇది ఒకటని ఆ అనీల్ కాంత్ అన్నారు. ఒక హత్య కేసును శాస్త్రీయంగా, వృత్తిపరంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా ఎలా పరిశోధించాలో అనేదానికి ఇది ఒక ఉదాహరణ అని డీజీపీ తెలిపారు.

ALSO READ  త్వరలో గాల్లోకి.. రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా ఎయిర్ లైన్స్‌కు కేంద్రం ఆమోదం

ట్రెండింగ్ వార్తలు