Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..

ఈయర్ ఎండింగ్ వచ్చేస్తోంది. కొన్ని రోజుల్లో 2021 సంవత్సరం ముగుస్తుంది. ఈలోపు పూర్తి చేయాల్సిన ఫైనాన్షియల్ అంశాలు కొన్ని ఉన్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు

Major Financial Works : డిసెంబర్ 31లోగా ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే నష్టపోతారు..

Major Financial Works

Financial Works : క్యాలెండర్ ఈయర్ ఎండింగ్ వచ్చేస్తోంది. కొన్ని రోజుల్లో 2021 సంవత్సరం ముగుస్తుంది. ఈలోపు పూర్తి చేయాల్సిన ముఖ్యమైన ఫైనాన్షియల్ అంశాలు కొన్ని ఉన్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు నుంచి లైఫ్ సర్టిఫికెట్ వరకు.. డిసెంబర్ 31 నాటికి పూర్తి చేయాలి. ఈ పనులు చేయడంలో ఆలస్యమైతే నష్టపోవాల్సి రావచ్చు.

* పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి డిసెంబర్ 31 లాస్ట్. జీవన్ ప్రమాణ్ పోర్టల్ లో ఇది పూర్తి చేయండి.
పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందడం కంటిన్యూ కావాలంటే వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని సకాలంలో సమర్పించడం చాలా ముఖ్యం. పెన్షనర్లు వ్యక్తిగతంగా శాఖలను సందర్శించడం ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా ఈ ప్రమాణపత్రాన్ని సమర్పించవచ్చు. ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాలనుకుంటే, దీని కోసం జీవన్ ప్రమాణ్ (https://jeevanpramaan.gov.in/) పోర్టల్‌ను సందర్శించాలి.

Jaggery Milk : చలికాలంలో పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే?

* ఐటీఆర్ దాఖలు చేయడానికి గడువు డిసెంబర్ 31. లేదంటే ఫైన్ పడుతుంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి ప్రభుత్వం గడువును డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించింది. ITR గడువు రెండుసార్లు పొడిగించారు. ముందుగా సాధారణ గడువు జూలై 31 నుంచి సెప్టెంబర్ 30, 2021 వరకు పొడిగించారు. ఆ తర్వాత డిసెంబర్ 31 వరకు పొడిగించారు. కొత్త ఆదాయపు పన్ను పోర్టల్‌లోని అవాంతరాల కారణంగా గడువు పొడిగించారు.

కాగా, ఐటీఆర్ దాఖలు చేయడం ఆలస్యం అయితే జరిమానా పడుతుంది. మీ ఆదాయం 5 లక్షల వరకు ఉంటే రూ.1000 ఆలస్య రుసుము, మీ ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఆలస్య రుసుము రూ.10వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. పన్ను బకాయి ఉండి, డిసెంబర్ 31లోపు రిటర్న్‌ను ఫైల్ చేయకుంటే, ఒక రోజు ఆలస్యమైనా, నెల మొత్తానికి 1 శాతం చొప్పున వడ్డీని చెల్లించాలి.

* డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను కేవైసీ చేయడానికి డిసెంబర్ 31 వరకే గడువు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను KYC చేయడానికి గడువును 30 సెప్టెంబర్ 2021 నుండి 31 డిసెంబర్ 2021 వరకు పొడిగించింది. ఏప్రిల్ లో సెబీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం డిపాజిటర్లు అంటే NSDL, CDSLలో ఇప్పటికే ఉన్న డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాల్లో ఆరు ముఖ్యమైన KYC ఫీచర్లు అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

* ఆధార్ తో యూఏఎన్ లింక్ చేయడానికి గడువు డిసెంబర్ 31. లింక్ చేయలేకపోతే నెలవారీ పీఎఫ్ జమ కాదు.
ఆధార్‌తో UAN నెంబర్ లింక్ చేయడానికి గడువు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించారు. సామాజిక భద్రతా కోడ్ సెక్షన్ 142 ప్రకారం ఆధార్‌తో PF ఖాతాను లింక్ చేయడం తప్పనిసరి. UANతో ఆధార్ లింక్ చేయకపోతే EPF ఖాతాలో యజమాని నెలవారీ PF చందా జమ చేయలేరు. అలాగే, లింకింగ్ పూర్తయ్యే వరకు, మీరు మీ ఈపీఎఫ్ ఫండ్ నుంచి లోన్ తీసుకోలేరు, విత్‌డ్రా చేయలేరు.

Garlic Tea : చలికాలంలో ఆరోగ్యానికి వెల్లుల్లి టీ

* పీఎఫ్ అకౌంట్ కు నామినీ పేరు చేర్చాలి. ఇందుకు డిసెంబర్ 31 గడువు. ఆ లోపు నామినీ పేరు చేర్చలేదంటే పెన్షన్, బీమా డబ్బులు పొందే సదుపాయాలు కోల్పోతారు.
పీఎఫ్‌ ఖాతా ఉంటే అందులో నామినీ పేరును నమోదు చేయాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే డబ్బులు రావు. పీఎఫ్‌ అకౌంట్లో నామినీ పేరును ఫైనల్‌గా పరిగణిస్తారు. ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కల్పిస్తోంది ఈపీఎఫ్‌వో. ఇందులో ప్రతి నెల జమ అయ్యే మొత్తం.. భవిష్యత్తలో వివాహాలకు, ఇంటి నిర్మాణం, ఇతర ముఖ్యమైన అవసరాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఇక పెన్షన్‌ పథకం, బీమా సౌకర్యం.. ఉద్యోగి, వారి కుటుంబ సభ్యులకు భరోసాగా ఉంటుంది. అయితే వీటన్నింటిని పొందాలంటే పీఎఫ్‌ చందాదారుడు నామినీని ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి. చందదారులు నామినీని సులభంగా యాడ్‌ చేసుకనే సదుపాయాన్ని కల్పిస్తోంది ఈపీఎఫ్‌ఓ. ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

సో.. గడువు దగ్గరపడుతోంది. ఒకవేళ ఇందులో మీరు చేయాల్సిన పని ఏదైనా పెండింగ్ లో ఉంటే వెంటనే చేసేయండి. లేదంటే ఇబ్బందులు, నష్టాలు తప్పవు.