Jaggery Milk : చలికాలంలో పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే?

రోజూ వ్యాయామం చేసేవారు బెల్లం పాల‌ను తాగ‌డం వ‌ల్ల కండ‌రాలు ప‌టిష్టంగా మారుతాయి. రోజూ శారీర‌క శ్ర‌మ చేసే వారు కూడా ఈ పాల‌ను తాగితే మేలు జ‌రుగుతుంది.

Jaggery Milk : చలికాలంలో పాలల్లో బెల్లం కలిపి తీసుకుంటే?

Jaggery Milk

Jaggery Milk : ఆరోగ్యానికి ప్రధాన ఆహారం పాలు.. కాల్షియంతో పాటు ఇతర రకాల పోషకాలకు పాలు మూలం. రాత్రి పడుకునేటప్పుడు పాలు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయి. చలికాలంలో పాలతోపాటు కాస్త బెల్లం కలిపి తీసుకుంటే మరిన్ని లాభాలు పొందవచ్చు. ఇలా తీసుకుంటే శీతాకాలంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పాలు, బెల్లం.. రెండూ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. వీటిని విడి విడిగా తీసుకునే బ‌దులు క‌లిపి ఒకేసారి తీసుకోవ‌చ్చు. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా బెల్లం క‌లిపి తాగ‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి క‌నుక మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.

పాలల్లో బెల్లం కలుపుకుని తాగితే శ‌రీరాన్ని అంత‌ర్గ‌తంగా శుభ్రం చేయ‌డంలో బెల్లం బాగా ప‌నిచేస్తుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను బ‌య‌టకు పంపుతుంది. అందువ‌ల్ల పాల‌లో బెల్లం క‌లుపుకుని రోజూ రాత్రి తాగాలి. పాలు, బెల్లం నిత్యం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. పాల‌లో బెల్లం క‌లిపి తాగ‌డం వ‌ల్ల ర‌క్తం శుద్ధి అవుతుంది. మ‌హిళ‌ల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

బెల్లం క‌లిపిన పాల‌ను తాగ‌డం వల్ల శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రం కావ‌డ‌మే కాదు, ర‌క్తం కూడా శుద్ధి అవుతుంది. ర‌క్తంలో ఉండే వ్య‌ర్థాలు, విష ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరానికి ఎలాంటి హాని క‌ల‌గ‌కుండా కాపాడుకోవ‌చ్చు. శ‌రీరానికి ఐర‌న్ ల‌భిస్తుంది. దీంతో శ‌రీరంలో ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గ‌ర్భిణీల‌కు ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. యాక్టివ్‌గా ఉంటారు.

పాల‌లో అమైనో యాసిడ్లు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని తేమ‌గా ఉంచేందుకు స‌హాయ ప‌డ‌తాయి. అందువ‌ల్ల చ‌లికాలంలో వ‌చ్చే ప‌గుళ్ల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. చ‌ర్మం మృదువుగా ఉంటుంది. ప‌గ‌ల‌కుండా ర‌క్షించుకోవ‌చ్చు. చ‌ర్మం య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది. వాటిల్లోని పోష‌కాలు కొల్లాజెన్ ఉత్ప‌త్తిని పెంచుతాయి. ఇది చ‌ర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చి ర‌క్షిస్తుంది. పాల‌లో ఉండే లాక్టిక్ యాసిడ్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్‌గా ప‌నిచేస్తుంది. చ‌ర్మాన్ని మృదువుగా ఉంచేందుకు అవ‌స‌రం అయిన ఎంజైమ్‌ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. క‌నుక పాల‌లో బెల్లం క‌లిపి తాగితే చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు.

రోజూ వ్యాయామం చేసేవారు బెల్లం పాల‌ను తాగ‌డం వ‌ల్ల కండ‌రాలు ప‌టిష్టంగా మారుతాయి. రోజూ శారీర‌క శ్ర‌మ చేసే వారు కూడా ఈ పాల‌ను తాగితే మేలు జ‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న వారు రోజూ బెల్లం పాల‌ను తాగ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుంది. శ‌రీర మెట‌బాలిజం పెరిగి కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అజీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారు బెల్లం క‌లిపిన పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఆ స‌మ‌స్య నుంచి సుల‌భంగా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

పాల‌లో కాల్షియం అధికంగా ఉంటుంది క‌నుక ఈ పాల‌ను తాగితే చిన్నారులు, పెద్ద‌ల్లో ఎముక‌లు, దంతాలు దృఢంగా మారుతాయి. శ‌రీరానికి విట‌మిన్ డి ల‌భిస్తుంది. ఇది ఎముక‌ల‌ను బ‌లంగా మారుస్తుంది. స్త్రీల‌కు రుతు స‌మ‌యంలో వ‌చ్చే క‌డుపు నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు వేడి పాలలో బెల్లం తీసుకుంటే, మీరు పీరియడ్స్ సమయంలో నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అలాగే రక్తహీనత వంటి సమస్యలను దూరం చేస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో బెల్లం, పాలు తప్పనిసరిగా తీసుకోవాలి. నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. దీంతోపాటు వాపులు కూడా త‌గ్గుతాయి.

బెల్లం క‌లిపిన పాల‌ను తాగ‌డం వ‌ల్ల ఆ మిశ్ర‌మంలో ఉండే పొటాషియం బీపీని త‌గ్గిస్తుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళ‌న‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తుంది. మ‌న‌స్సును ప్ర‌శాంతంగా మారుస్తుంది. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే ఈ మిశ్ర‌మం వ‌ల్ల కొంద‌రికి అల‌ర్జీలు రావ‌చ్చు. అలాంటి సందర్భంలో వైద్యుల సలహాలు పాటించి వీటిని తీసుకోవటం మంచిది.