Garlic Tea : చలికాలంలో ఆరోగ్యానికి వెల్లుల్లి టీ

అల్లం మరియు వెల్లుల్లి రోగనిరోధక శక్తికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా మంచివి. అల్లం మరియు వెల్లుల్లి జీర్ణవ్యవస్థకు మంచిది.

Garlic Tea : చలికాలంలో ఆరోగ్యానికి వెల్లుల్లి టీ

Garlic Tea

Garlic Tea : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం కోసం వివిధ రకాల పానీయాలను తాగుతున్నారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది వెల్లుల్లి టీ. వెల్లుల్లి టీ తాగడం వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లిని గత కొన్ని సంవత్సరాల నుంచి మనం వంటల్లో ఎంతో విరివిగా ఉపయోగిస్తున్నాము. చలికాలంలో వెల్లుల్లి టీ తాగటం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి.

వెల్లుల్లి కేవలం వంటకు రుచి ఇవ్వడమే కాకుండా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు దాగివున్నాయి. ముఖ్యంగా యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. వెల్లుల్లిని తినటం వల్ల మన శరీరంలో జీర్ణక్రియ మెరుగుపడటంమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి కూడా దోహదం చేస్తుంది.

అల్లం మరియు వెల్లుల్లి టీ మన ఆరోగ్యానికి చాలా మంచివని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్లం మరియు వెల్లుల్లి శ్వాస సంబంధిత సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చు. ఈ పానీయం రుతుస్రావం నొప్పిని తగ్గించడానికి, జీర్ణశయాంతర ప్రేగులను ఉపశమనం చేయడానికి, యాంటీఆక్సిడెంట్‌లతో శరీరానికి ఆజ్యం పోస్తుంది మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

గుండె జబ్బులు, క్యాన్సర్ , ఇతర ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరమని చెప్పవచ్చు. ఈ విధంగా ఎన్నో ఔషధ గుణాలు కలిగినటువంటి వెల్లుల్లితో టీ తయారు చేసుకొని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు తెలియజేస్తున్నారు. సాధారణ టీ కన్నా, వెల్లుల్లి టీని తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు తొలగించడంలో వెల్లుల్లి టీ ఎంతో దోహదపడుతుంది.

వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు మన శరీర బరువును నియంత్రించడానికి దోహదపడతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా వెల్లుల్లి టీ తాగటం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోయి, శరీర బరువును నియంత్రించడానికి దోహదం చేస్తుంది. అలాగే రక్తప్రసరణను వేగవంతం చేసి రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది.

రోజూ ఒక కప్పు వెల్లుల్లి చాయ్ ని తాగితే.. షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుందట. వెల్లుల్లి లేదా ఎల్లిగడ్డ శరీరానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. అందుకే నిత్యం మనం కూరల్లో వెల్లుల్లిని వేసుకుంటాం. వెల్లుల్లి క్లోమ గ్రంధిలో ఉండే బీటా కణాలను ఉత్తేజితం చేస్తుంది. దాని వల్ల శరీరానికి కావాల్సిన ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. దీంతో షుగర్ అదుపులో ఉంటుంది. అలాగే.. శరీరంలో ఉన్న చెడు కొలెస్టరాల్ ను కూడా వెల్లుల్లి తగ్గిస్తుంది. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా రావు. అందుకే.. వెల్లుల్లిని డైరెక్ట్ గా తినకుండా రోజూ చాయ్ రూపంలో తీసుకుంటే.. షుగర్ లేవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

ఉదర సమస్యలతో బాధపడేవారు, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ ఉదయం పరగడుపున వెల్లుల్లి టీ తాగటం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వెల్లుల్లి టీ ఘాటుగా ఉంటుందని భావించేవారు వెల్లుల్లి టీ లోకి కొద్దిగా తేనె కలుపుకుని తాగినా ఈ విధమైనటువంటి ప్రయోజనాలను పొందవచ్చు.

అల్లం మరియు వెల్లుల్లి రోగనిరోధక శక్తికి మాత్రమే కాకుండా బరువు తగ్గడానికి కూడా మంచివి. అల్లం మరియు వెల్లుల్లి జీర్ణవ్యవస్థకు మంచిది. ఇది శరీరంలోని హానికరమైన టాక్సిన్‌లను తొలగించడంలో మరియు జీవక్రియ రేటును మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉండటం ద్వారా బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది.

వెల్లుల్లి టీ తయారీ విధానం ;
వెల్లుల్లి చాయ్ ని చాలా సింపుల్ గా చేయొచ్చు. ఒక పాత్ర తీసుకొని.. దాంట్లో కాసిన్ని నీళ్లు పోసి.. బాగా మరిగించండి. ఆ తర్వాత ఆ నీటిలో చిన్న అల్లం ముక్క వేయండి. అల్లాన్ని దంచి వేసినా పర్లేదు. ఇక.. తర్వాత వెల్లుల్లిని తీసుకొని.. వెల్లుల్లి రెబ్బలను బాగా నలపండి. నల్ల మిరియాల పొడిని కొంచెం తీసుకొండి. ఆ నీటిలో మెత్తగా చేసిన వెల్లుల్లి రెబ్బలు, నల్ల మిరియాల పొడిని వేసి అలాగే కాసేపు మరగనివ్వండి. ఆ తర్వాత నీళ్లు గోరు వెచ్చగా మారాక.. దాన్ని తాగేయండి. దాంట్లో కావాలంటే ఒక టీస్పూన్ తేనె కలుపుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. అల్లం-వెల్లుల్లి టీ తాగడానికి ఉత్తమ సమయం ఉదయం. అల్పాహారానికి ముందు తాగవచ్చు.