Naked Woman : బాబోయ్.. అర్థరాత్రి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తడుతున్న మహిళ, భయాందోళనలో స్థానికులు

అర్థరాత్రి సమయంలో నగ్నంగా బయటకు వస్తుంది. వీధుల్లో తిరుగుతుంది. ఇళ్ల ముందుకు వెళ్తుంది. కాలింగ్ బెల్ కొడుతుంది. తలుపులు తెరిచే ప్రయత్నం కూడా చేస్తుంది.

Naked Woman : బాబోయ్.. అర్థరాత్రి వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తడుతున్న మహిళ, భయాందోళనలో స్థానికులు

Naked Woman : ఉత్తరప్రదేశ్ రాంపూర్ లోని మిలాక్ గ్రామంలో ఓ యువతి చేస్తున్న పని స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. రాత్రి అయిందంటే చాలు.. వారికి వణుకు ప్రారంభమవుతుంది. ఆ యువతి చేస్తున్న పనితో కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఇంతకీ ఆమె ఏం చేస్తుందో తెలుసా.. అర్థరాత్రి సమయంలో నగ్నంగా వీధుల్లో తిరుగుతుంది. అంతేకాదు ఇంటి డోర్లు తడుతుంది. కాలింగ్ బెల్ నొక్కుతుంది. ఇలా ఆ యువతి చేస్తున్న పనితో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

గుర్తు తెలియని మహిళ మిలాక్ గ్రామంలో అలజడి రేపింది. ప్రతి రోజూ అర్థరాత్రి సమయంలో నగ్నంగా బయటకు వస్తుంది. వీధుల్లో తిరుగుతుంది. ఇళ్ల ముందుకు వెళ్తుంది. కాలింగ్ బెల్ కొడుతుంది. తలుపులు తెరిచే ప్రయత్నం కూడా చేస్తుంది. ఆ యువతి చర్యతో ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేగింది. ఆమెను చూసి కొంతమంది దెయ్యమేమో అని భయపడుతున్నారు. కాగా, ఆమె నగ్నంగా వీధుల్లో తిరుగుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

Also Read..Suicide In Railway Station : షాకింగ్ వీడియో.. ఏం కష్టం వచ్చిందో.. అంతా చూస్తుండగానే రైలు కిందకి దూకి రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

అర్థరాత్రి వేళ అమ్మాయిలు ఇంటి నుంచి బయటకు రావడానికి కూడా భయపడతారు. అలాంటిది ఓ యువతి.. అర్థరాత్రి సమయంలో నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లోకి వస్తుంది. అదీ ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా నగ్నంగా. ఇళ్ల ముందుకెళ్లి కాలింగ్ బెల్ నొక్కడం, డోర్లు తెరిచే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ స్థానికులను భయపెడుతున్నాయి.

వీడియోలో రికార్డ్ అయిన షాకింగ్ దృశ్యాలు చూసి స్థానికులు వణికిపోతున్నారు. ఎవరా యువతి? ఎందుకిలా చేస్తోంది? అనేది పెద్ద మిస్టరీగా మారింది. వీడియోలోని తేదీ ప్రకారం.. జనవరి 30న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై ఓ స్థానికురాలు పోలీసులను ఆశ్రయించింది. గుర్తు తెలియని యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also Read..Rat Stole Necklace : ఇదేందయ్యా ఇది.. ప్రముఖ నగల దుకాణంలో ఖరీదైన నెక్లెస్ చోరీ చేసిన ఎలుక, ఎవరికి ఇస్తుందో? వీడియో వైరల్

ఆమె వయసు 25ఏళ్లు ఉండొచ్చని, నగ్నంగా ఉందని పోలీసులతో చెప్పింది. తన ఇంటి ముందుకు వచ్చిన ఆమె.. తన ఇంటి కాలింగ్ బెల్ నొక్కిందని, 5 నిమిషాలు అలాగే ఇంటి ముందు నిల్చుందని తెలిపింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిందంది. అదే సమయంలో ఇద్దరు బైకర్లు ఆమెను ఫాలో అయ్యారు. ఆ తర్వాత పోలీస్ పెట్రోలింగ్ వాహనం వారిని ఫాలో అయ్యింది అని ఆ మహిళ పోలీసులతో చెప్పింది.

స్థానికులు భయాందోళన చెందుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై తాము విచారణ చేపట్టామన్నారు. వీధుల్లో నగ్నంగా తిరుగుతూ ఇంటి డోర్లు తట్టడం వెనుక ఆమె ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఆమె పూర్తి వివరాలు తెలుసుకునేందుకు అన్ని సీసీ కెమెరాల్లోని ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆమె ఎవరు? అన్నది ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదన్నారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో రాత్రి వేళ పోలీస్ గస్తీని పెంచామన్నారు. స్తానికులు ఎవరైనా ఆమెను చూస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నెంబర్ 112కి కాల్ చేసి చెప్పాలని సూచించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మొత్తం ఈ వ్యవహారం స్థానికులను టెన్షన్ పెడుతోంది. ఎవరా యువతి? ఎందుకిలా బట్టలు లేకుండా వీధుల్లోకి వస్తోంది? అర్థరాత్రి సమయంలో ఏం పని? ఇంటి ముందు నిలబడి కాలింగ్ బెల్ ఎందుకు కొడుతోంది. అసలామెకు ఏం కావాలి? దీని వెనుకున్న మిస్టరీ ఏంటి? అనేది చేధించాలని, వీలైనంత త్వరగా ఆ యువతిని గుర్తించి పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు.

కాగా, ఇలాంటి ఘటనే ఒకటి మొరాబాద్ రోడ్డుపై గతేడాది సెప్టెంబర్ లో జరిగింది. ఓ 15ఏళ్ల బాలిక నగ్నంగా రద్దీగా ఉన్న రోడ్డుపై నడుస్తూ కనిపించింది. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆ బాలిక మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించారు. బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.