Rat Stole Necklace : ఇదేందయ్యా ఇది.. ప్రముఖ నగల దుకాణంలో ఖరీదైన నెక్లెస్ చోరీ చేసిన ఎలుక, ఎవరికి ఇస్తుందో? వీడియో వైరల్

నగల దుకాణంలో ఓ ఎలుక నెక్లెస్ చోరీ చేసింది. ఖరీదైన నెక్లెస్ ను ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళ రాష్ట్రం కాసర్ గడ్ లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో ఈ ఘటన జరిగింది.

Rat Stole Necklace : ఇదేందయ్యా ఇది.. ప్రముఖ నగల దుకాణంలో ఖరీదైన నెక్లెస్ చోరీ చేసిన ఎలుక, ఎవరికి ఇస్తుందో? వీడియో వైరల్

Rat Stole Necklace : ఎలుకలు సాధారణంగా ఆహారాన్ని ఎత్తుకెళ్తుంటాయి. ఎవరూ లేని చోటు చూసి తింటుతుంటాయి. ఇది కామన్. కానీ, ఎలుకలు కూడా చోరీలు, దొంగతనాలు చేస్తాయంటే నమ్ముతారా? అది కూడా ఖరీదైన నెక్లెస్ ను ఎత్తుకెళతాయి అంటే విశ్వసిస్తారా? లేదు కదూ. అస్సలు నమ్మరు కదూ. కానీ, ఇక్కడ అదే జరిగింది. ఓ ఎలుక ప్రముఖ నగల దుకాణంలో చోరీకి పాల్పడింది.

నగల దుకాణంలో ఓ ఎలుక నెక్లెస్ చోరీ చేసింది. ఖరీదైన నెక్లెస్ ను ఎత్తుకెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేరళ రాష్ట్రం కాసర్ గడ్ లోని ఓ ప్రముఖ నగల దుకాణంలో ఈ ఘటన జరిగింది.

Also Read..Oil Steal From Running Train : వామ్మో.. వీళ్లేం దొంగలు రా నాయనా.. రన్నింగ్ ట్రైన్ నుంచి ఆయిల్ చోరీ, ఎలా కొట్టేస్తున్నారో చూడండి..

నగల దుకాణంలో అమ్మకానికి కొన్ని నెక్లెస్ లను ఉంచారు. షాప్ కి వచ్చే కస్టమర్లకు కనిపించే విధంగా డిస్ ప్లే లో నగలు పెట్టారు. అయితే, సడెన్ గా ఓ నగ మాయమైంది. ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. దీంతో షాపు సిబ్బంది కంగారు పడ్డారు. ఆ నగ కోసం వెతకడం ప్రారంభించారు. షాప్ మొత్తం వెతికారు. అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. నెక్లెస్ ఎక్కడా దొరకలేదు.

దీంతో షాపు ఓనర్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. అందులో కనిపించిన దృశ్యం చూసి ఓనర్ సహా సిబ్బంది షాక్ అయ్యారు. వారి నోట మాట రాలేదు. నెక్లెస్ చోరీ అయిన విషయం వాస్తవమే. కానీ, దాన్ని ఎవరు ఎత్తుకెళ్లారో చూసి వారి మైండ్ బ్లాంక్ అయ్యింది. ఓ ఎలుక ఖరీదైన నెక్లెన్ ను ఎత్తుకెళ్లినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.

Also Read..Theft In Gold Shop : OMG.. చీరను అడ్డం పెట్టుకుని జస్ట్ 20 సెకన్లలో రూ.10లక్షల గోల్డ్ నెక్లెస్‌ను ఎలా కొట్టేసిందో చూడండి..

అర్థరాత్రి.. షాపు సీలింగ్ నుంచి ఓ ఎలుక బయటకు వచ్చింది. సరిగ్గా దాని కన్ను అక్కడే డిస్ ప్లే లో ఉంచిన బంగారు నెక్లప్ పై కన్నుపడింది. ఆ నెక్లెస్ పై దానికి మోజు కలిగిందో మరో కారణమో తెలియదు కానీ, క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నోటితో ఈ నగను పైకి ఎత్తింది. దాన్ని నోట కరుచుకుని చటుక్కున అక్కడి నుంచి జంప్ అయ్యింది. ఇదంతా కూడా ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. ఎలుక చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ఎలుక ఎంత పని చేసింది? అని తల పట్టుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఖరీదైన నెక్లెస్ ను ఎలుక ఎత్తుకెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వాలెంటైన్స్ డే దగ్గర పడింది కదా.. ఆ ఎలుక తన లవర్ కి గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఇలా నగను చోరీ చేసి ఉంటుందని ట్వీట్ చేస్తున్నారు. కాగా, అదృష్టవశాత్తు షాపులో సీసీటీవీ కెమెరా ఉండటం, అదంతా అందులో రికార్డ్ కావడం సరిపోయింది. లేదంటే.. ఆ నగను ఎవరు కొట్టేశారో తెలిసేది కాదని, ఓ మిస్టరీలా ఉండిపోయేదని, సిబ్బందికి ఇబ్బందులు ఎదురయ్యేవని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Patiala Politics (@patialapolitics)