Bandi Sanjay : దమ్ముంటే.. అలా అనలేదని అమ్మవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలి? కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు. ప్రధానిని పట్టుకుని నీచంగా మాట్లాడతావా? మీరే పిచ్చికుక్కలు. మిమ్మల్ని చూసి కుక్కలకే కొత్త వైరస్ సోకే ప్రమాదముంది. Bandi Sanjay

Bandi Sanjay : దమ్ముంటే.. అలా అనలేదని అమ్మవారి ఆలయం ముందు ప్రమాణం చేయాలి? కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay Counter To KTR

Bandi Sanjay Challenge To KCR : ప్రధాని మోదీ తెలంగాణ టూర్ పొలిటికల్ హీట్ పెంచేసింది. మోదీ వ్యాఖ్యలు చిచ్చు రాజేశాయి. ఎన్డీయేలో చేరతానని, కేటీఆర్ ని ముఖ్యమంత్రిని చేస్తానని అందుకు మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ తనతో అన్నారని ప్రధాని మోదీ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు. ప్రధాని మోదీ పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ప్రధాని మోదీ.. సరిగ్గా ఎన్నికల వేళ ఇలా ఎందుకు అన్నారో అందరికీ తెలుసన్నారు.

ఇక, కేసీఆర్ ఒక ఫైటర్.. చీటర్ తో ఆయన కలవరు.. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చి పచ్చి అబద్దాలు చెప్పారు, ఎన్డీయే మునిగిపోయే నావ, ఎన్డీయేలో చేరడానికి మాకేమీ పిచ్చి కుక్క కరవలేదు అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్.

నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ చెప్పింది తప్పని నిరూపించగలరా? ఎన్డీయేలో చేరతానని, కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తానని అనలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మోదీ మద్దతు అడగలేదని తడిబట్టలతో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం ముందు ప్రమాణం చేస్తారా? అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు బండి సంజయ్. అలా అని కేసీఆర్ ప్రమాణం చేస్తే.. మోదీ అబద్దం చెప్పారని మేమంతా ఒప్పుకుంటామన్నారు బండి సంజయ్.

Also Read..Telangana Politics: చుట్టం చూపుగా తెలంగాణకు వచ్చి అబద్దాలు.. మోదీపై మండిపడ్డ కేటీఆర్

‘మీరే పిచ్చికుక్కలు. మిమ్మల్ని చూసి కుక్కలకే కొత్త వైరస్ సోకే ప్రమాదముంది. ఖబడ్డార్ ట్విట్టర్ టిల్లు. ప్రధానిని పట్టుకుని నీచంగా మాట్లాడతావా?
సీఎం పదవి కోసం కేసీఆర్ నే గోసలు పెడుతున్న వ్యక్తిని నీవు. మీది ఫక్తు మోసకారి కుటుంబం. మంత్రి పదవి కోసం నీ పేరునే తారక రామారావుగా మార్చిన చీటర్ మీ అయ్య. హద్దు మీరితే ప్రజలే మిమ్మల్ని తరిమికొడతారు. ఎన్డీఏ 38 పార్టీల కూటమి. బీఆర్ఎస్ పార్టీది ఏ కూటమి. నిన్ను ఎవడూ నమ్మడు. మోసగాళ్ల పార్టీ మీది.

దుబాయ్ చంద్రశేఖర్ రావు నుండి నేటి అజయ్ రావు వరకు అంతా మోసమే. అసలు తెర వెనుక ఏం జరిగిందో ఒక్కసారి వెళ్లి మీ అయ్యను అడుగు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు, బీజేపీకి 5వేల ఓట్లే తేడా. ఆ తర్వాత మీ అయ్య పోయి ఏం చేసిండో అడుగు. దుబ్బాక ఎన్నికల్లో, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్దఎత్తున డబ్బులు పంచి ఏం సాధించారు? మునుగోడులో వందల కోట్లు ఖర్చు చేసి ఏం సాధించారు? మహా అంటే బోటా బోటీ మెజారిటీతో గెలిచారంతే.

మోదీ ఇప్పుడే ఎందుకు బయటపెట్టారనుకుంటున్నావా? శిశుపాలుడి లెక్క మీరు నూరు తప్పులు చేశారు. మీ పాపాలు పండాయి. కాబట్టే బయటపెట్టారు. మీ కుటుంబమే పెద్ద మోసకారి కుటుంబం. దోచుకోవడమే మీ పని. తెలంగాణ అంటే మీ నలుగురే. నెంబర్ వన్ చీటర్స్ కుటుంబం. మోదీని చీటర్ అంటావా? మీ అయ్య నెంబర్ వన్ చీటర్. దొంగ దీక్ష చేసి మీడియా ఎదుట నటించాడు. మీ అయ్య సీఎం అయ్యాడంటే.. అది బీజేపీ పెట్టిన భిక్ష.

Also Read..Telangana Politics: కేసీఆర్ అంత మాటన్నారా? మోదీ సంచలన వ్యాఖ్యలు

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే రాకుండా పడుకుని దొంగ సంతకాలు చేసిన చీటర్ మీ అయ్య. సూటు బూటు వేసుకుని ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్ముతారనుకుంటున్నవా? తెలంగాణ ఉద్యమ సమయంలో ట్విట్టర్ టిల్లు బతుకు ఏంటో తెలుసా? ముడతల షర్ట్, అరిగిన రబ్బర్ చెప్పులు వేసుకున్నోడు.. ఇయాళ వేల కోట్లు ఎట్లా సంపాదించావు? మీ అయ్య ఏమైనా పాస్ పోర్టుల దందా చేసి వేల కోట్లు సంపాదించాడా? కర్నాటకలో మీ అయ్య వేల కోట్లు ఎట్లా పంచిండు? మోదీ చెప్పింది నిజమా? కాదా? వెళ్లి మీ అయ్యను అడుగు. ఈ మధ్య కేసీఆర్ కన్పించడం లేదు. యాడికి పోయారు? ఆయన మాట వినపడటం లేదు. కనుచూపు మేరలో కన్పించడం లేదు. కొడుకు పెట్టే ఇబ్బందులు భరించలేకే బయటకు వెళ్లడం లేదు. ఫాంహౌజ్ కే పరిమితమైండు. ఆ బాధలు భరించలేకే జ్వరమొచ్చిందట.

కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. మీలా క్షుద్ర పూజలు చేసే రకం మేము కాదు. మోదీ వస్తే తట్టుకోలేకపోతున్నారు. ఒక మంత్రేమో టీవీలు తంతున్నాడు. ఇంకోడు ఫ్లెక్సీలు చింపుతున్నాడు. మరొకడు మోడీ బోడీ అంటూ వాగుతున్నాడు. నేను సవాల్ చేస్తున్నా. మీ అయ్య మోదీ వద్దకు వెళ్లి ఎన్డీఏలో చేరతామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మద్దతివ్వాలని అడిగిన మాట వాస్తవమా? కాదా? ట్విట్టర్ టిల్లును సీఎం చేయాలనుకుంటున్నా. మద్దతివ్వాలని కోరారా? లేదా? తడిబట్టలతో పాతబస్తీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసే దమ్ము మీ అయ్యాకు ఉందాదా? లేదా? నా సవాల్ ను స్వీకరించాలి” అని విరుచుకుపడ్డారు బండి సంజయ్.