Telangana Politics: చుట్టం చూపుగా తెలంగాణకు వచ్చి అబద్దాలు.. మోదీపై మండిపడ్డ కేటీఆర్

గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ డిపాసిట్ కోల్పోయింది. ఇప్పుడు 110 స్థానాల్లో డిపాసిట్ కోల్పోవడం ఖాయం. ఇది నా సవాల్. ఆదాని వ్యవహారంలో జేపీసీ వేయడానికి ఎందుకు భయం?

Telangana Politics: చుట్టం చూపుగా తెలంగాణకు వచ్చి అబద్దాలు.. మోదీపై మండిపడ్డ కేటీఆర్

KTR counter to Modi: ఎన్డీయేలో కలుస్తానని కేసీఆర్ తనతో చెప్పారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చుట్టం చూపుగా వచ్చిన వ్యక్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఇకపై నుంచి ప్రధానిని ఎవరైనా కలిస్తే వీడియో కెమెరా పట్టుకొని పోవాలని, లేదంటే ఇలాంటి పిచ్చి ప్రేలాపణలు చేస్తూనే ఉంటారని కేటీఆర్ విమర్శించారు.

అంతకు ముందు నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘కేసీఆర్ గతంలో హైదరాబాద్ ఎన్నికలపుడు నాతో అప్యాయంగా ఉన్నారు. ఆర్భాటంగా స్వాగతం పలికారు. ఇప్పుడేమైంది? మా అవసరం తీరాక ఆయన ప్రవర్తన మారిపోయింది. మా కార్యకర్తలను ఎన్ని రకాలుగా వేధించినా భయపడేది లేదు. కాంగ్రెస్ కూటమి రానీయక పోవడంతో మళ్లీ నా దగ్గరికి కేసీఆర్ వచ్చారు. తన కొడుకును ఆశీర్వదించమని అడిగారు. నేను నిరాకరించాను. నాటి నుంచి నా కళ్లలోకి చూడ్డానికి కూడా సీఎం కేసీఆర్ భయపడుతున్నారు’’ అని అన్నారు.

Jogi Ramesh : దాడి చేస్తారని నీకంత భయముంటే నేనొచ్చి వారాహి యాత్రను నడిపిస్తా- పవన్ కల్యాణ్ కామెంట్స్‌కు మంత్రి జోగి రమేశ్ కౌంటర్

ఇక మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘ప్రధాని మోడీ పచ్చి అబద్ధాల కోరు. కేసీఆర్ ఫైటర్.. చీటర్ తో కలిసి పనిచేయరు. నన్ను సీఎం చేయడానికి మోడీని అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటి? మోడీవి అన్ని పచ్చి అబద్దాలు, పిచ్చి ప్రేలాపణలు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించి మోడీ మాట్లాడటం లేదు. ఇకపై ప్రధానిని ఎవరైనా కలిస్తే వీడియో కెమెరా పెట్టుకోవాలి. బీజేపీ 9 ఏళ్లలో తెలంగాణ లో చేసిందేమీ లేదు. ప్రధాని జిత్తులు తెలంగాణలో నడవవు. ఎన్డీయేతో చేరాల్సిన కర్మ మాకు పట్టలేదు. ఎన్డీయే మునిగిపోయే నావ. ఎన్డీయేలో చేరడానికి మాకు పిచ్చి కుక్క కరవలేదు’’ అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బీజేపీ డిపాసిట్ కోల్పోయింది. ఇప్పుడు 110 స్థానాల్లో డిపాసిట్ కోల్పోవడం ఖాయం. ఇది నా సవాల్. ఆదాని వ్యవహారంలో జేపీసీ వేయడానికి ఎందుకు భయం? విపక్షాలు అంతగా మాట్లాడినా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుందో ప్రధాని చెప్పాలి. ప్రధాని మోదీ చుట్టం చూపుగా తెలంగాణకు వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు’’ అని విమర్శలు గుప్పించారు.