Home » 10tv
మార్కెట్ లో గోరుచిక్కుడకు నిలకడమైన ధరలు ఉంటుండటంతో ఈ గ్రామంలో ప్రతి రైతు గోరుచిక్కుడు ను సాగుచేస్తుంటారు. దాదాపు ఈ ఒక్క గ్రామంలోనే 100 ఎకరాల్లో ఈ పంటను సాగుచేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. పెద్దగా చీడపీడలు ఉండవు.
రుతుపవనాలు రాక ఆలస్యం కావడంతో.. పత్తి, సోయా పంటల సాగుకూడా అలస్యమైంది. చాలా వరకు మొదటి దఫా ఎరువులను కూడా వేశారు. అయితే కొంత బెట్ట వాతావరణ పరిస్థితుల తరువాత.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంటకు మేలు చేస్తున్నాయి.
ప్రస్తుతం వృదాగా ఉన్న బంజరు భూముల్లో టేకు, సుబాబుల్, జామాయిల్, మలబారు వేపలాంటి పంటలను వేసి ఆదాయాన్ని పొందుతున్నారు. ఎర్రచందనం, శ్రీగంధం లాంటి ధీర్ఘకాలిక పంటలను సాగుకు అన్ని ప్రాంతాలు అనువైనవి కావు.
కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టే వారికి, ఎటువంటి ఆర్ధిక ఇబ్బంది కలగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నివిధాలుగా చేయూతనందిస్తున్నాయి . ముఖ్యంగా రేరింగ్ గది నిర్మాణం, రేరింగ్ పరికరాల, క్రిమి సంహారక మందులు, కొమ్మలను కత్తిరించేందుకు సికే�
గతంలో ఎకరాకు 3,4 క్వింటాళ్ల దిగుబడి రావటం కష్టంగా వుండేది. కానీ ప్రస్థుతం అభివృద్ధిచెందిన రకాలతో ఎకరాకు 6 నుండి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది.
కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆశించిన స్థాయిలో ఆహార భద్రత , ఆదాయం లభించడం లేదు. వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ క్షేత్రవనరులనూ సమర్ధవంతంగా వినయోగించుకోవడం అత్యంత అవసంరం.
చిక్కుడుకు మార్కెట్లో మంచి డిమాండ్ వుంది. పాదు జాతి చిక్కుడును సాగుచేయాలంటే ఖర్చు అధికం. పైగా పంటకాలం కూడా ఎక్కువ.
వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమయ్యింది. ముఖ్యంగా రసంపీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది.
తప్పనిసరి పరిస్థితుల్లో 40 రోజులు దాటిన నారును నాటాల్సి వచ్చినప్పుడు యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటే, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.
మొదటి ఏడాది కొద్దిపాటి దిగుబడి వచ్చినా.. రెండో ఏడాది 4 టన్నల వరకు వచ్చింది. ప్రస్తుతం 3వ పంట.. ఇప్పటికే 4 టన్నుల దిగుబడిని పొందిన ఈ రైతు మరో 2 నెలల వరకు దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.