Paddy Cultivation : ముదురు వరి నారు వేసేటప్పుడు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తప్పనిసరి పరిస్థితుల్లో 40 రోజులు దాటిన నారును నాటాల్సి వచ్చినప్పుడు యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటే, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు.

Paddy Cultivation : ముదురు వరి నారు వేసేటప్పుడు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

paddy cultivation

Updated On : September 19, 2023 / 10:37 AM IST

Paddy Cultivation : వరినాటే పనులు చాలా వరకు పూర్తయ్యాయి. రైతులు సకాలంలో నారు పోసినప్పటికీ, కాలవల నుండి నీరు ఆలస్యంగా రావటంతో ఉత్తరకోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో నారు ముదిరిపోయింది. ప్రస్తుతం నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.

READ ALSO : Dragon Fruit : అమెరికన్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ సాగు

అయితే ముదురు నారు నాటే రైతాంగం, యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకోవటం తప్పనిసరి. ముదురు నారును నాటే రైతాంగం, పొలంలో మొక్కల సాంద్రత తగిన విధంగా వుండేలా చూసుకోవడమే కాకుండా ఎరువులు, కలుపు నివారణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త శేఖర్.

READ ALSO : Pests In Onion : ఉల్లిసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

ఈ ఏడాది ఖరీఫ్ వరి సీజన్ అస్తవ్యస్తంగా మారింది. చాలాప్రాంతాల్లో సకాలంలో నార్లు పోసినప్పటికీ, అధిక వర్షాల కారణంగా నారుమడులు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా లోని  కొన్ని ప్రాంతాలలో నీటి లభ్యత ఆలస్యం కావడంతో నారు ముదిరిపోయింది.

READ ALSO : Pests In Sesame : నువ్వు పంటసాగులో చీడపీడలు, సస్యరక్షణ చర్యలు!

తప్పనిసరి పరిస్థితుల్లో 40 రోజులు దాటిన నారును నాటాల్సి వచ్చినప్పుడు యాజమాన్యంలో తగిన మార్పులు చేసుకుంటే, దిగుబడి తగ్గకుండా చూసుకోవచ్చు. నాట్లు వేసేటప్పుడు భూమి తయారీ, పోషక యాజమాన్యం, కలుపు నివారణలో రైతులు తగిన మెళకువలు పాటించాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా, రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త శేఖర్.