Home » agriculturetips
సాధారణంగా మిర్చి పైరుకు నాటిన 60 రోజుల తర్వాత తెగుళ్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది బెట్టపరిస్థితులు ఏర్పడటం.. నాట్లు కూడా చాలా వరకు ఆలస్యమయ్యాయి. అంతే కాదు మొక్కలు నాటిన 30 రోజులకే చీడపీడలు, వైరస్లు దాడి చేసి మిర్చి పంటను పీల్చ�
సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.
తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ. పంటల పూత దశ ఎక్కడ వుంటే అక్కడకు పెట్టెలను తరలించాలి. రాణీఈగ గుడ్లు పెట్టే సామర్థ్యం, కూలీ ఈగలు సేకరించే మకరందం పైనే తేనె ఉత్పత్తి ఆధారపడి వుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో వరి ప్రస్తుతం చిరు పొట్ట దశ నుండి గింజ పాలుపోసుకునే దశకు చేరుకుంది. అధిక దిగుబడి సాధించేందుకు కీలకమైన ఈ దశలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దోమపోటు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది .
వేరుశనగను ఇటు తెలంగాణ , అటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, ఉత్తర కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తుంటారు రైతులు . ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. అయితే రైతులు, అధిక విస్తీర్ణంలో పాత రకాలనే సా�
సంప్రదాయ పంటలతో నష్టాలను చవిచూసే రైతులకు పట్టుపరిశ్రమ ఒక వరం లాంటిది. ఒక్కసారి పెట్టుబడి పెడితే.. దీర్ఘకాలంగా లాభాలను పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే పట్టుదల, పనిపట్ల నిబద్ధతు ఉండాలి.
దోస తక్కువ చీడపీడలు ఆశించి ఎక్కువ దిగుబడులు వస్తుండటంతో బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు మూడు ఎకరాల్లో సాగు చేపట్టాడు. ప్రస్తుతం మార్కెట్ అధిక రేటు పలుకుతుండటంతో.. మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు.
వంగ, బెండ , గోరుచిక్కుడు, ముల్లంగి, తీగజాతి కూరగాయలు, కంది, బంతిపూలు ఇలా పలు రకాలు పంటలతో ఉన్న ఈ మోడలే ఏటీఎం. అంటే ఎనీటైం పంటల దిగుబడి...
ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో గింజ పాటు పోసుకునే దశలో ఉంది. అయితే ఆగస్టు , సెప్టెంబర్ లలో కురిసిన వర్షాలుకు చాలా చోట్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీనినే మాణికాయ, కాటుక తెగులు అనికూడా అంటారు.
ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.