Pest Control : పత్తిలో పెరిగిన తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

Pest Control : పత్తిలో పెరిగిన తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Pest Control

Pest Control : ప్రస్తుతం పత్తి కాయ పెరిగే దశనుండి పగిలే దశ వరకు ఉంది. కొన్ని ప్రాంతాల్లో పత్తితీతలు కూడా జరుగుతున్నాయి. అయితే తెగుళ్ల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇప్పటివరకు సగం దిగుబడి మాత్రమే తీసిన రైతులు, ప్రస్థుతం వున్న పూత, పిందె పత్తిగా చేతికొస్తుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలో తెగుళ్ల నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త అశ్విని.

READ ALSO : Pink Bollworm in Cotton : పత్తిలో గులాబిరంగు పురుగును అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు

తెలంగాణలో ఈ ఏడాది పత్తి విస్తీర్ణం అంచనాలకు మించి పెరిగింది. వర్షాలు కురవడం, గాలిలో తేమశాతంపెరగడం, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పంటలో శిలీంధ్రపు బూజు తెగుళ్ల వ్యాప్తికి అనుకూలంగా  మారింది. ముఖ్యంగా  సెర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుళ్లు, బాక్టీరియా నల్లమచ్చ ఆశించి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. వీటిని గుర్తించిన వెంటనే సకాలంలో అరికడితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను రైతులకు తెలియజేస్తున్నారు  వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డి. అశ్విని.

READ ALSO : Lung Cancer : పురుషులలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రారంభ సంకేతాలు ఇవే ?

తెగుళ్లు ఆశించి ఆకులు రాలిపోవడం వల్ల, కాయలు తొందరగా పగిలిపోయి పత్తినాణ్యత తగ్గిపోయే ప్రమాదం వుంది.  కాబట్టి రైతులు వీటిని గమనించిన వెంటనే మందులు పిచికారి చేసి పంటను కాపాడుకోవాలి. తద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు.