Pink Bollworm in Cotton : పత్తిలో గులాబిరంగు పురుగును అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు

పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం  కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి.

Pink Bollworm in Cotton : పత్తిలో గులాబిరంగు పురుగును అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు

Pink Worm Prevention

Updated On : October 30, 2023 / 4:54 PM IST

Pink Bollworm in Cotton : ఇటివల కురిసిన వర్షాలకు పత్తి తడిసి పోవడంతో పాటుగా… కాయలు కూడ కుళ్లి పోయాయి. దీంతో రైతులు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకోంది. అయితే చాల మంది రైతులు పత్తి పంటను పోడగించాల వద్ద అనే సందేహంలో ఉన్నారు. అలాంటి రైతులు సమగ్ర యాజమాన్య పద్దతులు పాటిస్తే… తిరిగి లాభదాయకమైన దిగుబడులను తీయవచ్చని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్జాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. వెంకటేశ్వరరావు.

READ ALSO : Weed Control : పత్తిపంటలో కలుపు నివారణ చర్యలు

ఇటీవల కురిసిన వర్షాలకు మెట్ట పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి.  పంటల్లో నీరు నిలవడం , గాలిలో తేమశాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. తెలంగాణలో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న పత్తి పంట ప్రస్థుతం  కాత దశలో ఉంది. చాలా చోట్ల పత్తి తీతలు జరుగుతున్నాయి. అయితే వరుసగా కురిసిన భారీ వర్షాలకు పత్తి చేలన్నీ నీటిలో మునిగిపోయాయి. చాలా చోట్ల పత్తి తడిసిపోయింది. కొన్నిచోట్ల కాయకుళ్లు సమస్యలు తలెత్తాయి.

READ ALSO : Pest Control : పురుగుల సంతతిని అరికట్టటంతోపాటు, ఉధృతి తగ్గించే సరికొత్త టెక్నాలజీ..

ఈ సమయంలో పంటను కొనసాగించాలనుకునే రైతులు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు పొందేందుకు ఆస్కారం ఉందంటూ.. వివరాలు తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్జాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా. వెంకటేశ్వరరావు.

READ ALSO : Cotton Crop : పత్తిలో తెగుళ్ళ ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం

పత్తి పంటను పొడగించే రైతులు నవంబర్ లో చలి ఉంటుంది కాబట్టి  గులాబిరంగు పురుగు, పచ్చదోమ ఆశించే అవకాశం ఉంటుంది.  వీటి నుండి పంటను రక్షించుకోవాలంటే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్తల ద్వారా తెలుసుకుందాం