Cotton Crop : పత్తిలో తెగుళ్ళ ఉధృతి.. నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం
వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమయ్యింది. ముఖ్యంగా రసంపీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది.

Cotton Crop
Cotton Crop : ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి పైరు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో వుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది. ముఖ్యంగా తెగుళ్లతో పాటు ఆకుమచ్చ, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్లు ఆశించి తీవ్రం నష్టపరుస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన చర్యలను తెలియజేస్తున్నారు వరంగల్ జిల్లా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. రాం ప్రసాద్ .
READ ALSO : Dragon Fruit : అమెరికన్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ సాగు
ప్రస్తుతం పూత, కాత దశలో ఉంది. అయితే ఇటీవల కురిసిన వర్షాలు, ప్రస్తుతం వాతావరణంలో ఉన్న తేమ కారణంగా పత్తిలో చీడపీడల సమస్య అధికమయ్యింది. ముఖ్యంగా రసంపీల్చు పురుగులైన పచ్చదోమ వలన పంటకు అధిక నష్టం జరుగుతుంది. ఇవి మొక్కల నుంచి రసం పీల్చటం వల్ల పెరుగుదల తగ్గిపోయి, దిగుబడులపై ప్రభావం తీవ్రంగా వుంటుంది. పచ్చదోమ నష్టపరిచే విధానం, నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా. రాం ప్రసాద్ .
READ ALSO : Prevention of Pests : వరి, పత్తిలో చీడపీడల నివారణ
అధిక తేమతో కూడిన వాతావరణం ఉండటంతో చాలా ప్రాంతాలలో కాయకుళ్ళు తెగులు ఆశించింది. కాయదశలో ఉన్నప్పుడు వర్షాలు అధికంగా పడితే అనేక రకాల శిలీంధ్రాలు ఆశించి కాయలు కుళ్లిపోతాయి. పురుగుల వల్ల ఏర్పడిన రంధ్రాల ద్వారా శిలీంద్రాలు కాయలోకి ప్రవేశించిన తెగులును కలుగజేస్తున్నాయి. మరో వైపు ప్రస్తుతం వర్షాల కారణంగా పత్తిలో పోషకాల లోపం ఏర్పడి వడలి పోతున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం ఇప్పుడు చూద్దాం..