Prevention of Pests : వరి, పత్తిలో చీడపీడల నివారణ

ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, మొక్కజొన్న పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది.

Prevention of Pests : వరి, పత్తిలో చీడపీడల నివారణ

Prevention of pests

Prevention of Pests : కొన్ని రోజులుగా బెట్టకు గురైన పత్తిచేలు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కుదురుకుంటున్నాయి. అయితే పత్తితోపాటు వరిపైర్లలో కూడా అక్కడక్కడ చీడపీడలు ఆశించి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా పురుగుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల  ఆకులు రంగు మారిపోయి, మొక్కలు సరిగా ఎదగటంలేవు. వీటితో పాటు గులాబీరంగు పురుగు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

READ ALSO : Green Gram Cultivation : ఆలస్యంగా పంటలు వేసే ప్రాంతాలకు అనువైన పెసర.. అధిక దిగుబడల కోసం మేలైన యాజమాన్యం

మరోవైపు వరికి కాండంతొలుచుపురగు, సుడిదోమ, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించి తలనొప్పిగా మారాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ గురించి తెలియజేస్తున్నారు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.

ఈ ఖరీఫ్ లో వేసిన పత్తి, వరి, మొక్కజొన్న పైర్లు వివిధ ప్రాంతోల్లో వివిధ దశల్లో ఉన్నాయి . ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా పూత, కాత దశల్లో ఉన్న పత్తిపై చీడపీడల ఉదృతి పెరిగింది. ముఖ్యంగా రసంపీల్చే పురుగులతోపాటు పిండినల్లి, టొబాకోస్ట్రీక్ వైరస్, గులాబిరంగు పురుగులు ఆశించి తీవ్రం నష్టపరుస్తున్నాయి.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

మరోవైపు చాలా ప్రాంతాల్లో వరి పంటకు  కాండంతొలుచుపురగు, సుడిదోమ, బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని గుర్తించిన వెంటనే నివారించినట్లైతే మంచి దిగుబడిని పొందేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఆశించే చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలను తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు.