Mani Pandu Tegulu : వరిలో మానిపండు తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో గింజ పాటు పోసుకునే దశలో ఉంది. అయితే ఆగస్టు , సెప్టెంబర్ లలో కురిసిన వర్షాలుకు చాలా చోట్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీనినే మాణికాయ, కాటుక తెగులు అనికూడా అంటారు.

Mani Pandu Tegulu : వరిలో మానిపండు తెగులు ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

mani pandu tegulu

Mani Pandu Tegulu : తెలంగాణలో రాష్ట్రంలో వాన కాలం సాగు చేస్తున్న పంటలలో వరి ప్రధాన మైన పంట. ఈ పంటను సుమారు 40 నుండి 50లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు.  ఈ సీజన్ లో సన్న గింజ రకాలనే అధికంగా సాగు చేయడం జరిగింది. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన వర్షాలకు వరి పంటలో మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. ఇది ఆశింస్తే దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం ఉంది. దీని నివారణ కోసం రైతులు ముందస్తు చర్యలను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త,  శ్రీనివాస్ రెడ్డి.

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

తెలంగాణలో చెరువుల కింద, బావుల కింద వర్షాధారం చేసుకొని ఖరీఫ్ లో అధికంగా వరి సాగు చేస్తుంటారు రైతులు . దాదాపు 50 లక్షల ఎకరాల్లో సాగవుతున్న ఈ పంటలను, ఈ సారి ప్రభుత్వం సన్నగింజ రకాలు 60 శాతం, దొడ్డు గింజ రకాలను 40 శాతం విస్తీర్ణంలో పండించాలని సూచించింది. కానీ రైతులు అధికంగా సన్నగింజ రకాలవైపే మొగ్గుచూపారు.

READ ALSO : Mixed Farming : మిశ్రమ వ్యవసాయంతోనే లాభాలు

ప్రస్తుతం వివిధ ప్రాంతాలలో గింజ పాటు పోసుకునే దశలో ఉంది. అయితే ఆగస్టు , సెప్టెంబర్ లలో కురిసిన వర్షాలుకు చాలా చోట్ల మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉంది. దీనినే మాణికాయ, కాటుక తెగులు అనికూడా అంటారు. ఇది అధికంగా పూతదశలో ఆశిస్తుంది. అండాశయంలోని శిలీంధ్రం పెరుగుదల వల్ల ఆకుపచ్చరంగు ముద్దగా అభివృద్ధి చెంది, పసుపు రంగులోకి మారి చివరకు నల్లబడుతుంది.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

గాలిలో అధిక తేమశాతం, మబ్బులతో కూడిన వర్షపు జల్లులు , మంచు కురవడం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. గత ఖరీఫ్ లో కూడా ఈ తెగులు ఆశించి పంట దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే దీనిని నివారించవచ్చని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం, శాస్త్రవేత్త,  శ్రీనివాస్ రెడ్డి.