Chilli Crop : మిర్చి పంటపై తెగుళ్ల దాడి.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు

సాధారణంగా మిర్చి పైరుకు నాటిన 60 రోజుల తర్వాత తెగుళ్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది బెట్టపరిస్థితులు ఏర్పడటం.. నాట్లు కూడా చాలా వరకు ఆలస్యమయ్యాయి. అంతే కాదు  మొక్కలు నాటిన 30 రోజులకే చీడపీడలు, వైరస్‌లు దాడి చేసి మిర్చి పంటను పీల్చి పిప్పి చేస్తున్నాయి.

Chilli Crop : మిర్చి పంటపై తెగుళ్ల దాడి.. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు

chilli plant

Chilli Crop : వాతావరణ మార్పుల కారణంగా మిర్చి పంటకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఈ ఏడాది ఆరంభంలోనే పైరుకు తెగుళ్లు సోకుతున్నాయి. ఎన్ని మందుల పిచికారీ చేస్తున్న మొక్కలు కోలుకోవడం లేవు. తెగుళ్ల బారినుంచి పంటను రక్షించుకునేందుకు అనేక సస్యరక్షణ చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేదంటు రైతులు వాపోతున్నారు. ఇప్పటికే వేలాది రూపాయలు ఖర్చు చేశామని.. చివరకు పెట్టుబడులు కూడా వస్తాయో లేదోనని అయోమయంలో ఉన్నారు.

READ ALSO : Chima Mirchi : చీమ మిర్చి.. దీని కారం నషాలం అంటుతుంది

రెండేళ్లుగా బహిరంగ మార్కెట్‌లో మిర్చికి మంచి డిమాండ్‌ ఏర్పడడం అందుకు తగ్గ ధర లభిస్తుండడంతో ఈ ఏడాది అధిక సంఖ్యలో రైతులు మిర్చి సాగుకు మొగ్గు చూపారు. గతేడాది మిర్చి క్వింటాకు రూ.25 వేలు వరకు ధర పలికి చివరకు రూ.16 వేలకు పడి పోయింది. ధర పలికినా తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గిపోయి పెట్టుబడులు రావడమే గగనం అయ్యింది. అయినా రైతులు ఈ ఏడాదీ మిర్చి పంట వైపే మొగ్గు చూపి లక్షలాది ఎకరాల్లో సాగు చేశారు.

READ ALSO : Harvesting Chillies : మిర్చి కోతల సమయంలో తీసుకోవాల్సి జాగ్రత్తలు !

సాధారణంగా మిర్చి పైరుకు నాటిన 60 రోజుల తర్వాత తెగుళ్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ ఏడాది బెట్టపరిస్థితులు ఏర్పడటం.. నాట్లు కూడా చాలా వరకు ఆలస్యమయ్యాయి. అంతే కాదు  మొక్కలు నాటిన 30 రోజులకే చీడపీడలు, వైరస్‌లు దాడి చేసి మిర్చి పంటను పీల్చి పిప్పి చేస్తున్నాయి. తెల్ల దోమ, పచ్చదోమ, నల్లిపురుగు, తామర, పచ్చపురుగులు, పొగాకు గొంగళిపురుగుల దాడి అధిక మైంది. మొక్క దశలోనే ఆకు ముడతలు సోకి కుచించుకుపోతు న్నాయి. వీటన్నీటికి వాతావరణ మార్పులే తెగుళ్లకు కారణమని తెలుస్తోంది.

READ ALSO : Chilly farmers: మిర్చి రైతులకు కన్నీరు తెప్పిస్తున్న వైరస్

నెల రోజుల క్రితం వేసిన మిర్చి పంటకు తెగుళ్లు సోకి మొక్క ల ఎదుగుదల లోపించింది. నివారణ కోసం వేలాది రూపా యలు ఖర్చు చేసి పురుగు మందులు వాడుతున్నా ఫలితం కానరావడం లేదు. అపరాలు, వాణిజ్య పంటలతో పోలిస్తే మిర్చి సాగు ఏటా భారంగా మారుతోంది. కౌలు రైతులపై అదనంగా కౌలు రూపంలో భారం పడుతోంది. ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చు  మరింత అధికమైంది. అపరాలు, వాణిజ్య పంటలకు ఎకరా నికి రూ.50 వేలు ఖర్చయితే, మిర్చి పంటకు రూ.3 నుండి 4 లక్షలు వరకు ఖర్చు అవుతోందని..  చివరకు పెట్టుబడులు తిరిగి వస్తాయన్న గ్యారంటీ లేదని వాపోతున్నారు ఏలూరు జిల్లా, వేలేరుపాడు గ్రామానికి చెందిన రైతు