Pinnelli Brothers : పిన్నెల్లి సోదరులకు బిగ్‌షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు
Pinnelli Brothers : పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు
Pinnelli Brothers
Pinnelli Brothers : పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జంట హత్యకేసులో సుప్రీంకోర్టు వీరికి మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా… ఆ మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. వారికి ముందస్తు బెయిల్ కు అర్హత లేదని జస్టిస్ సందీప్ మెహతా తెలిపారు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేశారు. పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వెంకట్రామిరెడ్డిలు సరెండర్ అయ్యేందుకు సుప్రీంకోర్టు రెండు వారాలు గడువు వచ్చింది.
