Cultivation of Vegetable :షేడ్ నెట్ లో కూరగాయల నర్సరీ మొక్కల పెంపకం
ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.

Vegitable Cultivation
Cultivation of Vegetable : ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఆరోగ్యంపై దృష్టికి పెడుతున్నారు. కూరగాయలు, పండ్ల వినియోగం అధికంగా ఉండటంతో చాలా మంది రైతులు సంప్రదాయ పంటల స్థానంలో కూరగయాల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం కూరగాయలు, పండ్లు, పూల మొక్కలకు ఏర్పడిన డిమాండ్‌ను పలువురు అందిపుచ్చుకొని నర్సరీలను ఏర్పాటుచేసి రైతులకు కావాల్సిన నారుమొక్కలను పెంచి ఇస్తున్నారు. ఈ కోవలోనే బాపట్ల జిల్లాకు చెందిన ఓ రైతు నర్సరీ నిర్వాహణ ద్వారా మంచి లాభాలను పొందుతున్నారు.
READ ALSO : Mulberry Cultivation : రెండెకరాల్లో పట్టుపురుగుల పెంపకం.. నెలకు లక్షరూపాయల నికర ఆదాయం
సాధారణంగా రైతాంగం సమతల మళ్ళలో నారును పెంచుతూ వుంటారు. ఈ విధానంలో మురుగునీటి సౌకర్యం లేకపోవటం వల్ల నారుకుళ్ళు తెగులు బెడద ఎక్కువగా వుండి, సకాలంలో నారు అందక, అదును తప్పటం.. మళ్ళీమళ్ళీ నారును పోయాల్సి రావటం వంటి పలు కారణాల వల్ల రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరిగేవి. పైగా అదును తప్పటం వల్ల దిగుబడులు తగ్గి, రాబడి ఏమంత ఆశాజనంగా వుండేది కాదు. ఎత్తుమళ్ళలో నారుపెంపక విధానం ఈ సమస్యలను కొంత వరకు అధిగమించినా, చీడపీడల ఉధృతి ఎక్కువగా వుండటంతో… ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది.
READ ALSO : Papaya Cultivation : తైవాన్ రెడ్ లేడీ రకం బొప్పాయి సాగు.. ఎకరాకు రూ. 2 లక్షల నికర ఆదాయం
అందుకే చాలా మంది రైతులు షేడ్ నెట్ లు, పాలీ హౌజ్ లు ఏర్పాటుచేసి కూరగాయల నారు మొక్కల పెంపకం చేపట్టి… రైతులకు అందిస్తూ.. మంచి లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే బాపట్ల జిల్లా, అద్దంకి మండలం, చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన రైతు దేవినేని కోటేశ్వరరావు .. ఉద్యానశాఖ ప్రోత్సాహంతో షేడ్ నెట ఏర్పాటుచేసి ప్రోట్రేల లో నారుపెంచుతున్నారు. డిమాండ్ కు అనుగుణంగా కూరగాయల నార్లు పెంచుతూ.. రైతులకు అందిస్తున్నారు. అన్ సీజన్ లో కూరగాయలు పండిస్తూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. అంతే కాదు, తనతో పాటు మరికొంత మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
READ ALSO : Dragon Fruit Cultivation : డ్రాగన్ ఫ్రూట్ సాగుతో.. సత్ఫలితాలు సాధిస్తున్న యువరైతు
ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధానపొలంలో నాటినపుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం వుంటుంది కనుకు దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.