Home » 10tvagri
విజయనగరం జిల్లాలో వ్యవసాయశాఖతో పాటు పలు స్వచ్చంద సంస్థలు ఈ ఏడాది రైతులతో చిరుధాన్యాల సాగు చేయించేందుకు సిద్దమవుతున్నాయి.
Green Black Gram Cultivation : గత కొంత కాలంగా మార్కెట్లో మంచి ధరలు పలుకుతుండటంతో.. రైతులు సంప్రదాయ పంటల స్థానంలో స్వల్పకాలంలో అందివచ్చే పెసర, మినుము పంటలను రెండో పంటగా సాగుచేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు.
ఈమధ్య కాలంలో ప్రోట్రేలలో నారుపెంపక విధానం అమిత ఆదరణ పొందుతోంది. అందుకే చాలా ప్రాంతాల్లో కొందరు రైతులు షేడ్ నెట్ ల క్రింద ప్రోట్రేలలో నారుపెంచి రైతులకు అందిస్తున్నారు.
వర్జీనియా పొగాకు తోటల సీజన్ ప్రారంభమైంది. దీంతో రైతులు ట్రే నారు పెంపకంపైదృష్టి సారిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తితో పాటు, లాభదాయకంగా ఉండటంతో గత కొద్ది సంవత్సరాల నుండి రైతులు మడినారు కంటే ట్రే నారు పెంపకాన్నే చేపడుతున్నారు.
ఒకే పంటపై ఆధారపడిన సంధర్బాల్లో రైతుకు రిస్కు పెరగటంతోపాటు, ఆదాయం కూడా నామ మాత్రమే. పాక్షిక నీడలో పెరిగే పసుపు మొక్కలు.. అలాగే అంతర పంటలుగా అనేక రకాల పండ్ల మొక్లతో ఏడాది పొడవునా దిగుబడులను తీయటమే కాకుండా బాడర్ క్రాపుగా వాక్కాయ నాటారు.
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు సుడిదోమ ఉధృతికి అనుకూలం. రైతులు ఎక్కువగా అధిక దిగుబడి నిమిత్తం దగ్గర, దగ్గరగా నాట్లు వేస్తుంటారు. అధికంగా నత్రజని ఎరువు వాడటంతో ఎక్కువగా పిలకలు తొడిగి పైరు పొలం అంతా కమ్ముతుంది.
ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండటంతో వారి పంటల సాగు మూడు పువ్వులు.., ఆరు కాయలు గా సాగుతునున్నది. తీరొక్క ఆకుకూరలు పండిస్తూ.. రోజువారీగా ఆదాయం పొందుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు…
ఒక్కో మొక్క ధర రూ.50 వెచ్చించి కొనుగోలు చేశారు. ఒక్కో స్థంబానికి 4 మొక్కలు చొప్పునా నాటారు. డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నారు. నాటిన ఏడాదిన్నర నుంచే దిగుబడులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం రెండోపంట దిగుబడులు వస్తున్నాయి.
నాటిని రెండు నెలల్లోనే పంట చేతికొస్తుంది. ఆరు నెలల వరకు దిగుబడి ఉంటుంది. సీజన్, డిమాండ్‌ను బట్టి కిలో రూ.80 నుంచి రూ.200 వరకూ ఉంటుంది. సీజన్ ముగిసే నాటికి రూ.200కుపైగా కూడా పలుకుతుంది.