Tobacco Cultivation : ప్రోట్రేలలో పొగాకు నారు పెంపకం.. అదనపు ఆదాయం పొందుతున్న రైతు
వర్జీనియా పొగాకు తోటల సీజన్ ప్రారంభమైంది. దీంతో రైతులు ట్రే నారు పెంపకంపైదృష్టి సారిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తితో పాటు, లాభదాయకంగా ఉండటంతో గత కొద్ది సంవత్సరాల నుండి రైతులు మడినారు కంటే ట్రే నారు పెంపకాన్నే చేపడుతున్నారు.

Tobacco Cultivation
Tobacco Cultivation : ట్రే పొగాకు నారుమడులు రైంతాగానికి లాభదాయకంగా మారాయి. ఈ తరహా సాగును గత నాలుగైదేళ్లుగా చేపడుతున్నారు రైతులు . మంచి దిగుబడులు, నాణ్యతతో పాటు ట్రేనారుతో వృథా ఖర్చులు లేకపోవడంతో.. రైతులు ఈ నారువైపే మొగ్గుచూపుతున్నారు. దీన్నే ఆసరగా చేసుకొని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ట్రే పొగాకు నర్సరీని నిర్వహిస్తున్నారు. తన భూమిలో నాటిన తరువాత మిగితా నారును ఇతర రైతులకు అమ్ముతూ అదనపు ఆదాయం పొందుతున్నారు.
READ ALSO : Groundnut Crop : వేరుశనగలో పంటను ఆశించే పొగాకు లద్దె పురుగు.. నివారణ చర్యలు
వర్జీనియా పొగాకు తోటల సీజన్ ప్రారంభమైంది. దీంతో రైతులు ట్రే నారు పెంపకంపైదృష్టి సారిస్తున్నారు. నాణ్యమైన ఉత్పత్తితో పాటు, లాభదాయకంగా ఉండటంతో గత కొద్ది సంవత్సరాల నుండి రైతులు మడినారు కంటే ట్రే నారు పెంపకాన్నే చేపడుతున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో నారు పెంపకం పట్ల శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.
READ ALSO : Tobacco Leaf Picking : పొగాకు ఆకులను దండకుట్టే మిషన్ తో తీరిన కూలీల సమస్య !
సాదారణంగా తోటలు వేసిన ఒకటి రెండు రోజుల్లో వర్షాలు కురిస్తే తోట దెబ్బతింటుంది, అదే ట్రే నారు అయితే వర్షం వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడుతుంది. ఈ కారణం చేతే ట్రే నారు నాటు వేయడానికే ఆసక్తి చూపుతున్నారు. దీన్నే అవకాశంగా మల్చుకొని కొందరు రైతులు ట్రేనారు నర్సరీలను ఏర్పాటు చేశారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, బంధపురం గ్రామానికి చెందిన రైతు కాట్రగడ్డ పరమేశ్వరరావు, నాలుగైదేళ్లుగా ట్రే పొగాకు నర్సరీని నిర్వహిస్తున్నారు. తన పొలానికి సరిపోయాక , మిగితా నారును ఇతర రైతులకు విక్రయిస్తూ.. మంచి లాభాలు పొందుతున్నారు.
READ ALSO : Tobacco Farming : తగ్గుతున్న పొగాకు సాగు విస్తీర్ణం… పొగాకు రైతులకు ఫలితం దక్కేనా..?
వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే పొగాకులో మంచి లాభాలను పొందవచ్చు. గత ఏడాది మంచి ధరలు పలకడంతో లాభాలను ఆర్జించారు. ఈ ఏడాది కూడా అలాంటి ధరలే ఉంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.