Tobacco Farming : తగ్గుతున్న పొగాకు సాగు విస్తీర్ణం… పొగాకు రైతులకు ఫలితం దక్కేనా..?
మనదేశంలో పొగాకు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందువరసలో ఉంది. దేశంలోని మిగితా రీజయన్ లతో పోల్చితే ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగింది. గత ఏడాది మార్కెట్లో మంచి ధరలు లభించాయి. మేలు రకంతో పాటు మధ్య రకం, తక్కువ నాణ్యత గల పొగాకు సైతం మంచి ధర పలికింది.

Tobacco Farming
Tobacco Farming : వాణిజ్య పంటల్లో ప్రధానమైన పొగాకు ఈసారి రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ డిమాండ్ అధికంగానే ఉండటం, దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉన్నాయి. అయితే పెరిగిన పెట్టుబడుల మేరకు ధరలు లేకపోవటం పొగాకు రైతుల్ని నిరుత్సాహానికి గురిచేస్తోంది. పొగాకు ద్వారా మన దేశానికి అతిఎక్కువ విదేశీ మారకద్రవ్యం వస్తున్నప్పటికీ… ఆ మేరకు లాభాలు పంటపండించే రైతులకు రావటం లేదని వాపోతున్నారు.
READ ALSO : Pest Control In Mirchi : మిరపలో పూత కాత దశలో పంటకు నష్టం కలిగిస్తున్న పూత పురుగు, నివారణ!
మనదేశంలో పొగాకు పండించే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందువరసలో ఉంది. దేశంలోని మిగితా రీజయన్ లతో పోల్చితే ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరిగింది. గత ఏడాది మార్కెట్లో మంచి ధరలు లభించాయి. మేలు రకంతో పాటు మధ్య రకం, తక్కువ నాణ్యత గల పొగాకు సైతం మంచి ధర పలికింది. దీంతో ఈ ఏడాది తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం, పోతవరం గ్రామంలో అధిక విస్తీర్ణంలో పొగాకును సాగుచేశారు రైతులు. పోతవరం పొగాకుకు పెట్టింది పేరు.
ఇక్కడ పండే పొగాకు నాణ్యతతో ఉండటంతో మార్కెట్ లో అధిక ధర పలుకుతూ ఉంటుంది. కొన్నేళ్లుగా పొగాకు సాగు ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో ఏఏటికాయేడు సాగు విస్తీర్ణం తగ్గిస్తూ వచ్చారు రైతులు. మరి ఈ ఏడాది సాగైన పంటకు ధర పలుకుతుందో లేదోనని రైతులు ఆందోళనలో ఉన్నారు.
READ ALSO : Chilli Cuts Cultivation : మిరప కోతల సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని పొగాకు సాగు క్రమేపీ తగ్గుతోంది. ఒకప్పుడు ప్రధాన వాణిజ్య పంటగా వేలాది ఎకరాల్లో సాగయ్యేది. ఐతే పెట్టుబడి అధికం కావడం, శ్రమకు తగ్గ ప్రతిఫలం లేకపోవడంతో దీని సాగుపట్ల రైతులు ఆసక్తి చూపడంలేదు. ఈ సారి మంచి ధరలు పలికితే పూర్వవైభవం వచ్చే అవకాశాలున్నాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.