Pest Control In Mirchi : మిరపలో పూత కాత దశలో పంటకు నష్టం కలిగిస్తున్న పూత పురుగు, నివారణ!

పూత కాత దశలో పూత పురుగు పూత, మొగ్గల దశలో దీని ఉధృతి అధికంగా ఉంటుంది. పూత, మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదగబడి ఆ లార్వాలు పూతలోకి చొచ్చుకు వెళ్ళి వాటిని తినేస్తాయి. దీంతో పూత కు నష్టం కలుగుతుంది. పూత విచ్చు కోకుండా రాలిపోతుంది.

Pest Control In Mirchi : మిరపలో పూత కాత దశలో పంటకు నష్టం కలిగిస్తున్న పూత పురుగు, నివారణ!

The pest that causes damage to the crop in chili at the stage of ripening, prevention!

Pest Control In Mirchi : మిర్చిధరలు బాగా ఉన్న నేపధ్యంలో మంచి అదాయం వస్తుందనుకుంటున్న రైతులకు చీడపీడల బెడద ఇబ్బంది కరంగా మారింది. ప్రస్తుతం పూత పురుగు పంటను ఆశించి తీవ్రంగా నష్టం కలుగ జేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో మిరప కోత దశలో ఉంది. పూత దశలో మిరపతోటలకు తీవ్రనష్టం కలిగిస్తున్నాయి. పిందె దశలో కాయలు గిడసబారి వంకరలు తిరిగి, పూత,కాత విపరీతంగా రాలిపోతున్నాయి. మిర్చి పంటకు తీవ్రనష్టం కలిగిస్తున్న ఈ దశలో రైతులు కొన్ని సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

పూత కాత దశలో పూత పురుగు పూత, మొగ్గల దశలో దీని ఉధృతి అధికంగా ఉంటుంది. పూత, మొక్కల ఆకులపై గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదగబడి ఆ లార్వాలు పూతలోకి చొచ్చుకు వెళ్ళి వాటిని తినేస్తాయి. దీంతో పూత కు నష్టం కలుగుతుంది. పూత విచ్చు కోకుండా రాలిపోతుంది. కాయలు తయారయ్యే దశలో కూడా కాయలకు నష్టం కలుగు జేస్తాయి. కాయలు గిడసబారి, గింజలు తయారవ్వకుండా పోతాయి. నిటారుగా ఉండాల్సిన కాయలు వంకర టింకరగా మారతాయి.

రైతులు పూత దశలో ఈ పురుగును గమనించినప్పుడు వేపనూనె 1500 పిపిఎం 5మి.లీ లేదా వేపగింజల కషాయం 5శాతం వారంలో 3సార్లు పిచికారీ చేస్తే తొలిదశలో ఆశించే పురుగులను, లార్వాలను నిర్మూలించవచ్చు.

అప్పటికీ ఉధృతి తగ్గకపోతే కార్భోసల్ఫాన్ 25 శాతం, ఈసి 2మి.లీ లేదా, ప్లూబెండమైడ్ 0.3మి.లీ, లేదా క్లోరాంట్రినిల్ ప్రోల్ 0.3మి.లీ లేదా ట్రజోఫాస్ 2.మి.లీ పిచికారి చేసినట్లైతే సమస్య నుండి బయటపడవచ్చు.

అలాగే ఒకే పురుగు మందును అధిక పర్యాయాలు వినియోగించకుండా మార్చి మార్చి వాడుకోవాలి. పురుగు మందులలో వేపనూనెను కూడా కలుపుకుంటే పురుగుల నివారణ సమర్ధవంతంగా చేపట్ట వచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.