Papaya Cultivation : 10 ఎకరాల్లో బొప్పాయి సాగు.. నికర ఆదాయం రూ. 20 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు.

Papaya Cultivation
Papaya Cultivation : పుడమి తల్లిని నమ్ముకుంటే పుట్టెడు కాష్టాలనుసైతం అధిగమించవచ్చని నిరూపిస్తున్నాడు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు కోసం వేచి చూడక , భూతల్లిని నమ్ముకున్నాడు. 4 ఏళ్లుగా బొప్పాయి సాగు చేస్తూ.. మంచి దిగుబడులు తీస్తున్నాడు. ఉద్యోగి కంటే అధికంగా సంపాదిస్తు.. పలువురికి ఆదర్సంగా నిలుస్తున్నాడు .
READ ALSO : Papaya Milk : బొప్పాయి పాలతో ఔషదాల తయారీ.. అదనపు ఆదాయం పొందుతున్న రైతులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. బొప్పాయి అన్ని సీజన్ లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లలో కంటే పోషకాలు పుష్కలంగా వుండటంతో వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. దీంతో రైతులు సంవత్సరం పొడవునా బొప్పాయిని పండిస్తూ.. మంచి రాబడులను సొంతం చేసుకుంటున్నారు.
READ ALSO : Papaya Varieties : మేలైన బొప్పాయి రకాలు.. సాగు యాజమాన్యం
ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, గొల్లగూడెం గ్రామంలో ఉంది. దీనిని సాగుచేస్తున్న రైతు రమేష్ కుమార్. ఈయన చవివింది ఎంకాం. కొన్నాళ్ల పాటు ఉద్యోగం కూడా చేశారు. కానీ అందులో సంతృప్తి దొరకలేదు. దీంతో ఉద్యోగానికి రాజీనామ చేసి.. సొంతూరికి చేరుకున్నారు. వంశపారంపర్యంగా వచ్చిన 10 ఎకరాల భూమిలో సంప్రదాయ పంటల స్థానంలో తైవాన్ రెడ్ లేడి రకం బొప్పాయి సాగుచేశారు. నిపుణుల సలహాలు, సూచనలు పాటిస్తూ.. 4 ఏళ్లుగా మంచి దిగుబడులను సాధిస్తున్నారు.
READ ALSO : Papaya Cultivation : బొప్పాయిసాగుకు అనువైన రకాలు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
పంట చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఎకరాకు 40 టన్నుల వరకు దిగుబడిని తీశారు రైతు. మారో 4 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్కెట్ లో కూడా మంచి ధరలు పలుకుతున్నాయి. ఎకరాకు అన్ని ఖర్చులు పోను రూ. 2 లక్షల ల వరకు నికర ఆదాయం వచ్చిందని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.