Home » FarmingTips
అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏకపంటగానే కాక పలుపంటల్లో అంతర, మిశ్రమ పంటగా సాగుచేసుకునే అవకాశం వుండటంతో చాలా మంది ఈ ఖరీఫ్ లో సాగుచేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత, కాత దశలో ఉంది.
ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.
ఆర్థికంగా ఎదగాలంటే బాగా చదివి ఉద్యోగాలే చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా కష్టపడేతత్వం, మరికొంత పెట్టుబడి ఉంటే సరిపోతుందని నిరూపిస్తున్నారు ఏలూరు జిల్లా, కొయిలగూడెం మండలం, అంకాల గూడెం గ్రామ రైతు ఏడుకొండలు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం ఏ ఏటికాయేడు పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు.
ఆకుకూరలకు మంచి డిమాండ్ ఉండటంతో వారి పంటల సాగు మూడు పువ్వులు.., ఆరు కాయలు గా సాగుతునున్నది. తీరొక్క ఆకుకూరలు పండిస్తూ.. రోజువారీగా ఆదాయం పొందుతూ.. మంచి లాభాలు ఆర్జిస్తున్నారు…
వేరుశనగ సాగులో సగటు వుత్పత్తి మన ప్రాంతంలో 5 నుండి 6క్వింటాళ్లకు మించటంలేదు. దీనికి ప్రధానంగా వేరుశనగలో ఆయాప్రాంతాలకు అనుగణంగా రకాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోవటం, యాజమాన్యంలో లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంభించడం మొదలుపెట్టారు. కషాయాల తయారీతో పాటు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ.. అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
ఈ ఏడాది పత్తి వేసిన రైతులకు ప్రస్తుత ప్రతికూల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు చాలా చోట్ల పంట నష్టం జరిగింది. ఇందులో అత్యధికంగా పత్తి వేసిన రైతులు ఎక్కువ మంది దెబ్బతిన్నారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగుపడుతున్నాయి.
మితిమీరిన రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు పంటలకు మేలు చేసే క్రిమికీట కాలు చనిపోతున్నాయి. తెగుళ్ల ఉధృతి కూడా పెరుగుతోంది. ఈ అంశాలన్నింటిపై రైతులను వ్యవసాయాధికారులు చైతన్యపరుస్తూ పకృతి వ్యవసాయం వైపు మళ్లిస�
చిరుధాన్యపు పంటలు మానవునికి ప్రకృతి ప్రసాదించిన వరం. నాగరికత ప్రారంభమైన కాలం నుంచి అనాదిగా సాగులో వున్నాయి. ఆరో దశాబ్ధం వరకూ చిరుధాన్యాలే మన ప్రధాన ఆహార పంటలు. పశువుల వ్యర్థాలే వీటికి ఎరువులు. అందువల్ల ఖర్చులూ పెద్దగా అయ్యేవి కాదు.