Maize Cultivation : రబీ జొన్నలో అధిక దిగుబడులకోసం పాటించాల్సిన మేలైన యాజమాన్యం

ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు. రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు.

Maize Cultivation : రబీ జొన్నలో అధిక దిగుబడులకోసం పాటించాల్సిన మేలైన యాజమాన్యం

Maize Cultivation

Updated On : November 19, 2023 / 1:17 PM IST

Maize Cultivation : తెలుగురాష్ట్రాల్లో మెట్ట వ్యవసాయంలో వర్షాధారంగా , రబీలో అరుతడి పంటగా జొన్నను రైతులు సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రబీలో పండించే చిరుధాన్యాలలో జొన్న ముఖ్యమైనది. జొన్నను విత్తి నెలరోజులు కావస్తోంది.  ప్రస్తుతం ఈ పంట పలు దశల్లో ఉంది. అయితే ఆలస్యంగా వేసిన ప్రాంతాల్లో చీడపీడలు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించిరు. వాటిని నివారించి , అధిక దిగుబడుల కోసం ఎలాంటి చర్యలు చేపట్టాలో రైతులకు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు .

READ ALSO : Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు

ఖరీఫ్ పంట కాలంలో పండించే జొన్న ఎక్కువగా పశువుల దాణా, కోళ్ళ మేత మరియు ఆల్కహాల్ తయారీ కొరకు వినియోగిస్తారు . రబీ పంటలో సాగుచేసిన జొన్న ఏకమొత్తంగా ఆహారపు అవసరాలకు వినియోగిస్తారు. అయితే  ఇటీవలి కాలంలో ఆరోగ్యాన్నిచ్చే ఆహారపు పంటగా జొన్న బహుళ ప్రజాధారణ పొందింది. మార్కెట్ ధర కూడా ఆశాజనకంగా ఉండడం వల్ల జొన్నను రబీలో ఎక్కువ స్ధాయిలో పండించడానికి రైతాంగం మొగ్గుచూపుతున్నారు. అయితే రబీలో వేసిన జొన్న, ప్రస్తుతం  మోకాలు ఎత్తు దశలో ఉంది. ఈ సమయంలో సరైన   యాజమాన్య పద్ధతులను పాటించినట్లైతే అధిక దిగుబడులను సాధించవచ్చంటున్నా జొన్న పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డా. ఉమాకాంత్.

READ ALSO : Corn Farming : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

రబీజొన్నను ఆలస్యం వేసుకున్న ప్రాంతాల్లో  మొవ్వు తొలుచు ఈగ , కాండం తొలుచు పురుగు, పేనుబంక రబీజొన్నను ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త రైతులకు సూచించారు. రబీలో సాగుచేసిన జొన్నకు మంచి మార్కెట్ ఉంటుంది. అయితే సకాలంతో శాస్త్రవేత్తల సలహాలు , సూచనలు పాటిస్తే మంచి దిగుబడులను తీసి, లాభాలను గడించవచ్చు.