Corn Farming : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

వరికి ప్రత్యామ్నాయంగా  మెక్కజోన్న సాగుచేపట్టగా దిగుబడులను పొందారు. దీంతో ఈ ఏడాది కూడా మెక్కజోన్న పంట అధిక విస్తీర్ణంలో వేశారు. అయితే  మారిన వాతావరణ పరిస్దితుల కారణంగా  పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రనష్టం వాటిల్లింది.

Corn Farming : తెగుళ్లతో మొక్కజొన్న రైతులకు తీవ్రనష్టం

Maize Cultivation

Updated On : October 15, 2023 / 3:41 PM IST

Corn Farming : ఆరుగాలం కష్టించి పంటలు పండించిన  అన్నదాతకు చివరకు కన్నీళ్లే మిగులుతున్నాయి . వరి పంటతో నష్టాలు వస్తుండటంతో ప్రత్యామ్నాయ పంటగా ఈ ఖరీప్ లో వేల ఏకరాల్లో  మొక్క జోన్నను సాగుచేశారు. అయితే ప్రస్తుతం చీడపీడలు ఆశించి పంట దెబ్బతినడంతో  రెంటికి చెడ్డ రేవడిగా వారి పరిస్ధితి మారింది. ఇదంతా శ్రీకాకుళం జిల్లాలోని  రైతుల పరిస్థితి.

READ ALSO : Tanya Appachu Kaul : ఈ కారణాలతో కూడా విడాకులు తీసుకుంటారా..? ఓ లాయర్ పోస్ట్ వైరల్

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వరి అధిక విస్తీర్ణంలో సాగవుతుండగా, ఆ తరువాతే మెక్కజోన్న , ప్రత్తి , చెరకు పంటలు సాగుచేస్తున్నారు . ప్రతి ఏటా వరి ఉత్పత్తి అధికమవుతుండటంతో  కోనుగోలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు రైతులకు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారించాలని కోరుతున్నారు.  పోందూరు మండలం గోకర్ణపల్లి , రంఘనాధపేట గ్రామాల్లో చాలా మంది రైతులు గత ఏడాది వరికి ప్రత్యామ్నాయంగా  మెక్కజోన్న సాగుచేపట్టగా దిగుబడులను పొందారు. దీంతో ఈ ఏడాది కూడా మెక్కజోన్న పంట అధిక విస్తీర్ణంలో వేశారు. అయితే  మారిన వాతావరణ పరిస్దితుల కారణంగా  పంటకు తెగుళ్లు ఆశించి తీవ్రనష్టం వాటిల్లింది.

READ ALSO : Hazel Keech : యువరాజ్ సింగ్ క్యాన్సర్ తరువాత.. అతడి భార్య తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా..?

మొక్క జోన్న పంటలో వచ్చే సమస్యలను రైతులు సకాలంలో గుర్తించక పోవడంతోనే సమస్య మరింత జటిలం అవుతుందని శాస్తవేత్తలు అంటున్నారు. ప్రధానంగా పాముపోడ తెగులు ఆశించడంతో జరుగుతున్న నష్టం నుండి పంటను కాపాడుకునేందుకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని తెలియజేస్తున్నారు.  రైతులకు పంట చేతికోచ్చే సమయంలో తెగుళ్లు ఆశించి తీవ్ర నష్టం జరిగింది. కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్తితి లేకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వం స్పందించి తమని ఆదుకోవాలని కోరుతున్నారు