Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు

ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తోంది. రెండేళ్లుగా కత్తెర పురుగు సమస్య వెన్నాడుతున్నా, దీని అరికట్టే చర్యల పట్ల రైతుల్లో అవగాహన పెరగటంతో సాగులో భరోసా పెరిగింది.

Maize Cultivation : రబీ మొక్కజొన్న సాగులో మెళకువలు

Maize Cultivation

Maize Cultivation : తెలుగు రాష్ట్రాలలో వరి తర్వాత అధిక విస్థీర్ణంలో సాగవుతున్న ప్రధాన ధాన్యపుపంట- మొక్కజొన్న. రబీ మొక్కజొన్నను అక్టోబరు మొదటివారం నుండి నవంబరు వరకు విత్తుకోవచ్చు. ఇప్పటికే విత్తిన ప్రాంతాల్లో పైరు 2,3 ఆకుల దశలో వుండగా…మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు విత్తుకోవటానికి సిద్ధమవుతున్నారు. రబీ మొక్కజొన్న విత్తినప్పటి నుంచీ పంట పూర్తయ్యే వరకు అన్ని దశల్లోను పాటించే యాజమాన్యంపైన దిగుబడులు ఆధారపడి వుంటాయి. వివరాలను ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రంజిత ద్వారా తెలుసుకుందాం.

READ ALSO : Maize Cultivation : వరిమాగాణుల్లో మొక్కజొన్న సాగు.. అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం

మొక్కజొన్నలో అధిక దిగుబడనిచ్చే అనేక సంకరరకాలు అందుబాటులోకి వుండటంతో రబీలో ఈ పంట సాగు ఈశాజనకంగా వుంది. ప్రస్థుతం మొక్కజొన్నకు కనీస మద్ధతు ధర క్వింటాకు 1760 రూపాయిలు వుండటం, ఎకరాకు 40 నుండి 50 క్వింటాళ్ల నమోదవటంతో రబీలో ఈ పంట సాగు రైతుకు లాభదాయకంగా వుంది.

READ ALSO : Kharif maize : ఖరీఫ్ మొక్కజొన్న సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు..నాణ్యతా ప్రమాణాలు

ఖరీఫ్ లో వర్షాధారంగా దీని సాగులో కొంత ఒడిదుడుకులు వున్నప్పటికీ, రబీలో నీటిపారుదల కింద నమ్మకమైన దిగుబడినిస్తోంది. రెండేళ్లుగా కత్తెర పురుగు సమస్య వెన్నాడుతున్నా, దీని అరికట్టే చర్యల పట్ల రైతుల్లో అవగాహన పెరగటంతో సాగులో భరోసా పెరిగింది. పంట విత్తే దశ నుండి రైతు చేపట్టే యాజమాన్యమే ఈ పంటలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు దోహదపడగలదని సూచిస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. రంజిత.

READ ALSO : Maize Cultivation : మొక్కజొన్నపంటకు కాండంతొలుచు పురుగుల బెడద

మొక్కజొన్నలో పైపాటుగా ఎరువులు వేసిన ప్రతిసారి నీటితడి ఇవ్వాలి. పంటకీలక దశలో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్త వహించాలి. అలాగే కలుపు నివారణ పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటారు శాస్త్రవేత్త రంజిత.