Kharif maize : ఖరీఫ్ మొక్కజొన్న సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు..నాణ్యతా ప్రమాణాలు

మొక్కజొన్నకు మంచి మార్కెట్టు ధర రావాలంటే కొన్ని నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. గింజలలో తేమ 14.0 శాతంకి మించకుండా ఉండాలి. దుమ్ము, చెత్త మట్టి పెళ్ళలు, రాళ్ళు మొదలయినవి 1.0 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు.

Kharif maize : ఖరీఫ్ మొక్కజొన్న సాగులో పాటించాల్సిన జాగ్రత్తలు..నాణ్యతా ప్రమాణాలు

Maize Farming

Updated On : October 17, 2023 / 3:30 PM IST

Kharif maize : మొక్కజొన్నను ఆహారంగానే కాక, పశువుల దాణా, మేతగా బేబికార్న్ గా ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. మొక్కజొన్నలో కాలపరిమితిని బట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక , స్వల్పకాలిక రకాలు సాగు చేస్తున్నారు. నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు మొక్కజొన్న సాగుకు అనుకూలంగా ఉంటాయి. మొక్కజొన్నకు సుమారు 500-800. మి.మీ. నీరు అవసరమవుతుంది. మొక్కజొన్నలో పూతకు ముందు, పూత మరియు గింజ పాలు పోసుకునే దశలో 30-40 రోజుల వరకు పొలంలో నీరు నిలువ ఉండరాదు.

READ ALSO : Persons Neck : మెడ పొడవును బట్టి వారు ఎలాంటివారో చెప్పొచ్చట..!

పంట కోతలకు సంబంధించి కండెల పైపొరలు ఎండి, మొక్కలపై వేలాడుతూ, గింజలు గట్టిపడి నొక్కులు పడకుందా, తేమ శాతం25-30% ఉన్నప్పుడు పంట కోత చేపట్టాలి. కండెలను ౩-4 రోజులు బాగా ఎండబెట్టాలి. యంత్రాలతో గింజలను నూర్చిడి చేసి గింజలలో వచ్చే తేమ శాతం 10-12 ఉండే వరకు ఆరబెట్టి నిలువ చేయాలి.పేలాల కోసం ఉపయోగించే రకాలను గింజలలో 30-36% తేమ ఉన్నప్పుడే కండెలు కోసి నీడలో ఆరబెట్టాలి. ఎండలోఆరబెదితే గింజ పగిలి నాణ్యత తగ్గుతుంది. తీపి రకాలను గింజ పాలుపోసుకునే దశలోనే కండెలు కోసుకోవాలి. బేబీకార్న్‌ కొసం పీచు వచ్చిన 1 లేదా 2వ రోజున కోసుకోవాలి. ఆలస్యం చేసినట్లయితే బెండులో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గుతుంది. మొక్కజొన్నను పశువుల మేత కోసం వేసినవ్చుడు 50% పూతదశలో పైరును కోయాలి.

READ ALSO : Ponguleti Srinivas Reddy : బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెసే : పొంగులేటి

నవంబరు-దిసెంబరు మాసాలలో వరి కోతల అనంతరం విత్తుకోవాలి. బరువైన మరియు తేమను నిలువుకొను నేలలో మాత్రమే ఈ పద్దతిని పాటించాలి. వరికోసిన తరువాత తేమలేనట్లయితే ఒక తేలికపాటి తడి ఇచ్చి మొక్కజొన్నను విత్తుకోవాలి. తాడును, ఉపయోగించి 60-300 సెం.మీ. ఎడమతో విత్తు కోవాలి.

నాణ్యతా ప్రమాణాలు:

మొక్కజొన్నకు మంచి మార్కెట్టు ధర రావాలంటే కొన్ని నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. గింజలలో తేమ 14.0 శాతంకి మించకుండా ఉండాలి. దుమ్ము, చెత్త మట్టి పెళ్ళలు, రాళ్ళు మొదలయినవి 1.0 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. పాడైన గింజలు 1.5 శాతంకి మించకూడదు. ఇతర ఆహార గింజలు 2.0 శాతంకి మించకుండా ఉండాలి. రంగు మారిన , ముక్కలైన మొక్కజొన్న గింజలు. 45 శాతంకి మించకుండా ఉండాలి. కీటకాలు ఆశించిన గింజలు 1.0 శాతంకి మించకూడదు.

READ ALSO : yasangi paddy Ownership : యాసంగిలో చలితీవ్రంగా ఉన్న సమయంలో వరి నారుమడి యాజమాన్యం !

పంట సాగులో జాగ్రత్తలు ;

ఖరీఫ్‌లో వర్షాధారం క్రింద మొక్కజొన్నను పదును వర్షం, కురిసిన తరువాత మాత్రమే విత్తుకోవాలి. ఖరీఫ్‌లో వర్షాధారం క్రింద మొక్కజొన్నలో అంతర పంటగా కంది/పెసర/మినుము/ బొబ్బర్లు వేసుకోవాలి. ఎకరానికి 8 కిలోల విత్తనాన్ని 60-20 సెం.మీ. ఎడమతో విత్తుకోవాలి. కాండం తొలుచు పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్‌ 1.6 మిలీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్‌ 0.3 మి.లీ. లేక ఫూబెండమైద్‌ 0.2 మి.లీ. ఒక లీటరు నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10-12 రోజులకే పిచికారి చేయాలి.

READ ALSO : Revanth Reddy: కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?

విత్తిన 40-45 రోజుల వరకు పంటలో కలుపు లేకుండా చూడాలి. పైపాటుగా ఎరువులు వేసినవ్పుడు నేలలో తేమ తప్పనిసరిగా ఉండేలా చూడాలి. మొక్కజొన్నలో సున్నిత దశలైన పూత దశ మరియు గింజ పాలుపోసుకొనే దశలలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.