Persons Neck : మెడ పొడవును బట్టి వారు ఎలాంటివారో చెప్పొచ్చట..!
ఎదుటి మనిషి ఎటువంటివారో ఎలా తెలుస్తుంది..?మాట్లాడితే తెలియొచ్చు.. ఆ వ్యక్తితో కొంతకాలం జర్ని చేస్తే చెప్పొచ్చు. కానీ వ్యక్తుల పెదవులను చూసి ముక్కును చూసి శరీర ఆకృతిని చూసి ఎటువంటివాళ్లో చెప్పగలమా?.. అంటే చెప్పొచ్చని కొంతమంది అధ్యయనకారులు చెబుతున్నారు.

persons neck length personality
persons neck length personality : ఎదుటి మనిషి ఎటువంటివారో ఎలా తెలుస్తుంది..?మాట్లాడితే తెలియొచ్చు.. ఆ వ్యక్తితో కొంతకాలం జర్ని చేస్తే చెప్పొచ్చు. కానీ వ్యక్తుల పెదవులను చూసి ముక్కును చూసి శరీర ఆకృతిని చూసి ఎటువంటివాళ్లో చెప్పగలమా?.. అంటే చెప్పొచ్చని కొంతమంది అధ్యయనకారులు చెబుతున్నారు. కొన్ని ట్రిక్స్ తో వారి శరీర ఆకృతిని బట్టి చెప్పొచ్చట. అలా ఎదుటి మనిషి పెదవులు చూసి ముక్కు ఉన్న తీరును బట్టే కాదు మెడ పొడవును చూసి కూడా వారి వ్యక్తిత్వం ఎటువంటిదో చెప్పొచ్చట.. మెడ ఆకారాన్ని చూసి వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చని కొంత మంది అధ్యయనకారులు చెబుతున్నారు. ఎదుటి మనిషి మెడ పొడవు..మెడలోని వంపును బట్టి వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చట..
పొడవాటి మెడ
పొడవాటి మెడ ఉన్న వ్యక్తి తనకేమైన సమస్యలు వస్తే తానే పరిష్కరించుకోగలరట. అంతేకాదు మెడ పొడవుగా ఉన్న వ్యక్తులు తమ జీవితంలో ఎదుటివారి జోక్యాన్ని అస్సలు ఇష్టపడరట. తమ సమస్యను తామే పరిష్కరించుకోవాలనుకుంటారట. అలాగే స్నేహితుల విషయం కూడా వారికి కొన్ని నిర్ధిష్టమైన నమ్మకాలుంటాయట. ఎవరిని అంత తేలిగ్గా నమ్మరట. వారిని చక్కగా అర్థం చేసుకునే స్నేమతులను మాత్రమే ఇష్టపడతారట. రిజర్వుడుగా ఉంటారట.
Pet Dog : కుక్కను పెంచుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..?
చిన్న మెడ
మెడ చిన్నగా అంటే కురచగా ఉన్న వ్యక్తులు విధేయులుగా ఉంటారట. తమ స్నేహితులకు సపోర్ట్ గా ఉండేందుకు ఇష్టపడతారట. ఏ విషయంలో అయినా కమిట్ మెంట్ తో ఉంటారట. స్నేహితుల మధ్య బంధానికి విలువ ఇచ్చేలా ఉంటారు. అలాగే సమాజంలో విషయంలో బాధ్యత కలిగి ఉంటారు. ఎవరికైనా సమస్యలు వస్తే సహాయం చేయటానికి ముందుకొస్తారు. దీని వల్ల వారికి బాధ కలిగినా సహాయం చేసేందుకు వెనుకాడరు. వారికి వారు సంరక్షులుగా ఉండటమేకాకుండా ఇతరుల కోసం సహాయంగా ఉండేందుకు ఇష్టపడతారట.
సాధారణ మెడ
మెడ సాధారణంగా ఉండే వ్యక్తులు జీవితంలో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారట.మీరు అన్నింటికంటే శాంతి, సామరస్యానికి విలువ ఇస్తారు. మీరు క్లిష్ట పరిస్థితుల్లో మధ్యవర్తిగా గుర్తిస్తారు. అనవసర వాదనలకు దూరంగా ఉండాలన్నారు. మీడియం పొడవు మెడ ఉన్న వ్యక్తులు ఇతరుల సమస్యను పరిష్కరించడం గురించి ఆలోచిస్తారట. దీని వల్ల పలుమార్లు సమస్యల్లో చిక్కుకుంటుంటారు. తమను తాము ఇబ్బందులకు గురిచేసుకుంటుంటారట.